ఇద్దరు విలన్లు జలసమాధి కేసు, ప్రముఖ కన్నడ హీరో పరార్, తమిళనాడు రిసార్టులో అరెస్టు!

బెంగళూరు: స్యాండిల్ వుడ్ మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఇద్దరు విలన్లు జలసమాధి అయిన కేసులో ప్రముఖ కన్నడ హీరో, బ్లాక్ కోబ్రా దునియా విజయ్ ని బెంగళూరు నగరంలోని చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీసులు తమిళనాడులో శుక్రవారం అరెస్టు చేశారు.

హెలికాప్టర్ లో విలన్లు

హెలికాప్టర్ లో విలన్లు

బెంగళూరు నగర శివార్లలో మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో హెలికాప్టర్ లో నుంచి తిప్పగుండనహళ్ళి చెరువులో పడి ప్రముఖ నటులు ఉదయ్, అనీల్ (విలన్లు) జలసమాధి అయిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలనే నటులు ఉదయ్, అనీల్ జలసమాధి అయ్యారని కేసు నమోదు అయ్యింది.

సినీ నిర్మాత నిర్లక్షం

సినీ నిర్మాత నిర్లక్షం

మాస్తిగూడి చిత్ర నిర్మాత సుందర్. పి గౌడ నిర్లక్షం కారణంగా కన్నడ నటులు ఉదయ్, అనీల్ జలసమాధి అయ్యారని బెంగళూరు నగరంలోని చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్తిగూడి సినిమా నిర్మాత సుందర్. పి గౌడను పోలీసులు అరెస్టు చెయ్యడానికి అప్పట్లో వెళ్లారు.

 హీరో, నిర్మాత పరార్

హీరో, నిర్మాత పరార్

ఆ సందర్బంలో మాస్తిగూడి నిర్మాత సుందర్. పి గౌడ తప్పించుకోవడానికి హీరో విజయ్ సహకరించాడని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం హీరో విజయ్ ని అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో అతను తప్పించుకున్నాడు.

రిసార్టులో హీరో

రిసార్టులో హీరో

నాలుగు రోజుల నుంచి హీరో విజయ్ కోసం వెతుకున్న పోలీసులు అతను తమిళనాడులోని ఓ రిసార్టులో తలదాచుకున్నాడని సమాచారం సేకరించారు. హీరో విజయ్ తమిళనాడులో తలదాచుకున్న రిసార్టు గుర్తించిన పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేసి బెంగళూరు తీసుకువస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+