సీఎం మీ విలువ ఎంత ? నా చెప్పుతో సమానం: కన్నడ నటుడి వార్నింగ్, విధాన సౌధ సేల్!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మీ విలువ ఎంతో చెప్పండి, నేను ఇస్తాను అంటూ కన్నడ నటుడు హుచ్చా వెంకట్ (పిచ్చి వెంకట్) చాలెంజ్ చేశారు. మీరు మనుషుల ప్రాణాలకు విలువ కడుతున్నారా ? మనుషులు అంటే మీకు లెక్కలేదా అంటూ కన్నడ నటుడు హుచ్చా వెంకట్ సీఎం కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ప్రశ్నించారు.

వీడియో వైరల్

వీడియో వైరల్

హుచ్చా వెంకట్ కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరైన సమయంలో జీతాలు అందకపోవడంతో ఇటీవల ఓ పారిశుద్ద కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కన్నడ నటుడు హుచ్చా వెంకట్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

నా చెప్పుతో సమానం

నా చెప్పుతో సమానం

ఆత్మహత్య చేసుకున్న పారిశుద్ద కార్మికుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అది తన చెప్పుతో సమానం (హుచ్చా వెంకటే ఊతపదం) అని ఆయన మండిపడ్డారు. మనిషి చనిపోయిన తరువాత రూ. 10 లక్షలు ఇస్తే ఏం లాభం లేదని, బతికి ఉన్న సమయంలో ఒక్క రూపాయి ఇచ్చినా ఫలితం ఉంటుందని హుచ్చా వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎంకు వార్నింగ్

సీఎంకు వార్నింగ్

పారిశుద్ద కార్మికులను ప్రవేటు సంస్థల పరం చేసి వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని, వెంటనే వారికి శాస్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి జీతాలు చెల్లించాలని హుచ్చా వెంకట్ సీఎం హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వరన్ ను హెచ్చరించారు.

మీ కోసం ప్రజలు ఉన్నారా ?

మీ కోసం ప్రజలు ఉన్నారా ?

ప్రజల నుంచి మీరు అధికారంలోకి వచ్చారా ? మీ నుంచి ప్రజలు బాగుపడుతున్నారా ? అంటూ ప్రభుత్వాన్ని హుచ్చా వెంకట్ ప్రశ్నించారు. పారిశుద్ద కార్మికుల ప్రాణాల విలువ ఏమిటో మీకు తెలుసా, ఎప్పుడైనా చెత్త, రోడ్లు శుభ్రం చేశారా ? అంటూ సీఎం, ఉప ముఖ్యమంత్రిని హుచ్చా వెంకట్ ప్రశ్నించారు.

విధాన సౌధను అమ్మేస్తారు

విధాన సౌధను అమ్మేస్తారు

ప్రజలు ఇలాగే అమాయకంగా ఉంటే విధాన సౌధను సైతం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడానికి మీరు వెనకడుగు వెయ్యరని హుచ్చా వెంకట్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. నిత్యం ఎవరో ఒకరి మీద విరుచుకుపడే హుచ్చా వెంకట్ ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షోతో హుచ్చా వెంకట్ పాపులర్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+