Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బళ్లారి ఎంపీ శ్రీరాములు, గాలి బ్రదర్స్ కు మద్తతుగా ఈగ ఫేం సుదీప్ ప్రచారం, బీజేపీకే మీ ఓటు!

Recommended Video

    ఎలక్షన్ ప్రచారాల్లో పాల్గొన్న సుదీప్

    బళ్లారి/బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో, బహుబాష నటుడు, రాజమౌళి ఈగ ఫేం కిచ్చ సుదీప్ బళ్లారి, చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ తరపున ప్రచారం చేశారు. బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని హీరో సుదీప్ మనవి చేశారు. మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఇప్పటికే హీరో సుదీప్ ప్రకటించారు.

    బళ్లారిలో హీరో సుదీప్

    బళ్లారిలో హీరో సుదీప్

    బళ్లారిలోని శ్రీరాంపుర కాలనీ మొయిన్ రోడ్డులో ఎంపీ. శ్రీరాములు, బళ్లారి సిటీ శాసన సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డితో కలిసి సుదీప్ రోడ్ షో నిర్వహించారు. హీరో సుదీప్ ను చూడటానికి బళ్లారి నగర ప్రజలు పెద్దఎత్తున పోటీ పడ్డారు.

    పార్టీ కాదు వ్యక్తి ముఖ్యం

    పార్టీ కాదు వ్యక్తి ముఖ్యం

    రోడ్ షోలో హీరో సుదీప్ బళ్లారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఏపార్టీకి చెందిన వాడు కాదని హీరో సుదీప్ అన్నారు. మాది సినిమా పార్టీ అని హీరో సుదీప్ చెప్పారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారి తరపున ప్రచారం చేస్తున్నానని హీరో సుదీప్ సమర్థించుకున్నారు.

    శ్రీరాములు స్నేహితుడు

    శ్రీరాములు స్నేహితుడు

    బళ్లారి ఎంపీ శ్రీరాములు తనకు 20 ఏళ్ల నుంచి స్నేహితుడు అని హీరో సుదీప్ చెప్పారు. శ్రీరాములు ప్రజలకు అనేక మంచి పనులు చేశారు. ఇక ముందు చేస్తారు. శ్రీరాములు లాగే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రజాసేవ చేశారని అన్నారు. గాలి సోమశేఖర్ రెడ్డిని మరోసారి గెలిపించి ప్రజాసేవ చెయ్యడానికి అవకాశం కల్పించాలని హీరో సుదీప్ స్థానిక ఓటర్లకు మనవి చేశారు.

    శ్రీరాములు కోసం హీరో

    శ్రీరాములు కోసం హీరో

    చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బళ్లారి శ్రీరాములు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మాళకాల్మూరు నియోజక వర్గంలోని నాయకనహట్టిలో హీరో సుదీప్ రోడ్ షో నిర్వహించి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు మద్దతుగా ప్రచారం చేశారు.

    శ్రీరాములును గెలిపించండి

    శ్రీరాములును గెలిపించండి

    తిప్పేస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన హీరో సుదీప్ శ్రీరాములుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. శ్రీరాములు లాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తే మీకు అంతా మంచి జరుగుతుందని, ఆయన నిత్యం ప్రజాసేవలోనే ఉంటారని, అందుకే ఆయనకు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి వచ్చానని హీరో సుదీప్ అన్నారు. మాళకాల్మూరు, కొండ్లహళ్ళి, నాయకనహట్టి ప్రాంతాల్లో శ్రీరాములు తరపున హీరో సుదీప్ ప్రచారం చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+