సినిమా షూటింగ్ లు రద్దు, హీరో హీరోయిన్లు ఇక్కడే ఓటు వేస్తున్నారు !

బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే10వ తేదీ బుధవారం 224 నియోజక వర్గాల్లో ఒకేసారి జరగనుంది. ఇంతకాలం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరోలు, నటీనటులు ఇప్పుడు సినిమా షూటింగ్ లు రద్దు చేసుకుని వారివారి నియోజక వర్గాల్లో ఓటు వేసి తమ అభిమానులు కచ్చితంగా ఓటు వెయ్యాలని చెప్పడానికి సిద్దం అవుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వాడివేడిగా ఉన్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని పార్టీల నాయకులు అనుకుంటున్నారు. అయితే మే 10వ తేదీ బుధవారం ఓటరు దేవుళ్లు ఎవరిని ఆశీర్వదిస్తారో అనే విషయం మే13వ తేదీ వరకు వేచి చూడాలి. ఇప్పటికే కర్ణాటకలో 80 ఏళ్ల వయసు నిండిన సీనియర్ సిటిజన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Kannada actors

కర్ణాటకలోని పలు ఎంఎన్ సీ కంపెనీలు వారు పని చేస్తున్న కంపెనీల పరిసర ప్రాంతాల్లో ఓటు వెయ్యడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఇంతకాలం ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా గడిపిన సినీ తారలు ఇప్పుడు వివిద ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్ లు రద్దు చేసుకుని బెంగళూరుకు పయనం అయ్యారు.

ఓటు వేస్తున్న ప్రముఖ నటీనటులు:

* హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్- బ్యాటరాయణపుర

* కిచ్చా సుదీప్- పుట్టేనహళ్లి.

* చాలెంజింగ్ స్టార్ దర్శన్- ఆర్ఆర్ నగర్

* కేజీఎఫ్ హీరో యష్- క్రతిగుప్ప

* రవిచంద్రన్- రాజాజీనగర్

* ఉపేంద్ర- కత్రిగుప్ప

* అశ్విని పునీత్ రాజ్ కుమార్- సదాశివనగర్

* రాఘవేంద్ర రాజ్ కుమార్- సదాశివనగర్

* తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్- జేపీ నగర్

* అభిషేక్ అంబరీష్- జేపీ నగర్

* తెలుగింటి ఆడపడుచు తారా- జేపీ నగర్

* కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- వసంత్ నగర్

* నిఖిల్ కుమారస్వామి-కేతమారనహళ్లి (బెంగళూరు శివార్లలోని బిడిది)

* దునియా విజయ్- కత్రిగుప్ప

* సాధుకోకిల- నాగరబావి

* ఆశికా- తుమకూరు

* జగ్గేష్- మల్లేశ్వరం

* చంద్రముఖి ఫేమ్ అవినాష్- ఆర్ఆర్ నగర్

* కారుణ్య రామ్-ఆర్ఆర్ నగర్

* దోడ్డణ్ణ- బిదరకల్లు

* చందన్ శెట్టి -నాగరబావి

* అనంత్ నాగ్- మల్లేశ్వరం

* అనిరుధ్- జయనగర్

* భారతి విష్ణువర్దన్- జయనగర్

* హరిప్రియా- ఆర్ఆర్ నగర్

* వశిష్ట సింహా- ఆర్ఆర్ నగర్

* మాలాశ్రీ- శివాజీనగర్

* రమేష్ అరవింద్- పధ్మనాభనగర్

* శ్రీ మురలి- వసంత్ నగర్

* అర్జున్ జన్య- హెబ్బాళ

* సప్తమి గౌడ- జేపీ నగర్

* మేఘనా సర్జా- జేపీ నగర్

* రుచితా రామ్- ఆర్ఆర్ నగర్

* రాధిక పండిత్- దేవయ్యపార్క్

* సుధారాణి- మల్లేశ్వరం

* రక్షితా ప్రేమ్- చంద్రాలేఔట్

* ప్రేమ్- చంద్రాలేఔట్

* కాంతార ఫేమ్ రక్షిత్ శెట్టి- కుందాపుర

* రాజ్ బి. శెట్టి- కుందాపుర

* యోగరాజ్ భట్- గిరినగర

* దండుపాళ్య ఫేమ్ పూజా గాంధీ- కత్రిగుప్ప

* పుష్పా మేమ్ డాలి దనంజయ్- అరసికెరె

* హర్షికా పూణచ్చ- కేఆర్ పురం

* అజయ్ రావ్- రాజాజీనగర్

* ద్వారకేష్- బోమ్మనహళ్లి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+