Actress. రాత్రి కారులో నటితో ఆడుకున్న క్యాబ్ డ్రైవర్, కామాంధుడి పేరు, కారు నెంబర్ !

బెంగళూరు: ఐటీ హబ్ లో క్యాబ్ డ్రైవర్ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన కలకలం రేపింది. మోడల్ గా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆ యువతి పని చేస్తోంది. అదే విధంగా ప్రముఖ కంపెనీలో కూడా ఆమె ఉద్యోగం చేస్తోంది. రాత్రి కంపెనీలో పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గం మద్యలో కామాంధుడైన క్యాబ్ డ్రైవర్ తనను లైగింక వేధింపులకు గురి చేశాడని. ఎదురు తిరిగితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

 మోడల్, కన్నడ నటి

మోడల్, కన్నడ నటి

బెంగళూరు నగరంలో కొంత మంది క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికును లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు నగరంలోని బాబూసాబ్ పాళ్యలో నివాసం ఉంటున్న యువతి మోడల్ గా, కన్నడ నటిగా, కన్నడ డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 రాత్రి క్యాబ్ బుక్ చేసిన కన్నడ నటి

రాత్రి క్యాబ్ బుక్ చేసిన కన్నడ నటి

మోడల్ గా, కన్నడ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆ యువతి జక్కూరులోని ప్రముఖ కంపెనీలో కూడా ఆమె ఉద్యోగం చేస్తోంది. రాత్రి 10.30 గంటలల సమయంలో ఆఫీసులో పని పూర్తి చేసుకున్న నటి బాబూసాబ్ పాళ్యలోని ఇంటికి వెళ్లడానికి ఓ కంపెనీకి చెందిన క్యాబ్ బుక్ చేసింది. యువతి ఉద్యోగం చేస్తున్న కంపెనీ దగ్గరకు క్యాబ్ వెళ్లింది.

 నటికి లైంగిక వేధింపులు

నటికి లైంగిక వేధింపులు

KA 51, H 5965 నెంబర్ కారులో వెళ్లిన డ్రైవర్ నటి పని చేస్తున్న కంపెనీ దగ్గరకు వెళ్లి కొంతసేపు వేచి చూశాడు. తరువాత నటి కారులో కుర్చున్న తరువాత డ్రైవర్ అక్కడి నుంచి బయలుదేరాడు. మార్గం మద్యలో కామాంధుడైన క్యాబ్ డ్రైవర్ తనను లైగింక వేధింపులకు గురి చేశాడని. ఎదురు తిరిగితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి హెణ్ణూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

 క్యాబ్ డ్రైవర్, ట్రావెల్స్ కంపెనీ మీద కేసు

క్యాబ్ డ్రైవర్, ట్రావెల్స్ కంపెనీ మీద కేసు

తనను కారులో క్యాబ్ డ్రైవర్ చిత్రహింసలకు గురి చేశాడని నటి కేసు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు. క్యాబ్ డ్రైవర్ పేరు మంజునాథ్ తిప్పేస్వామి అని, ఆ కారు నెంబర్ కూడా నటి ఇచ్చిందని, క్యాబ్ లు నడుపుతున్న ప్రైవేట్ కంపెనీ మీద నటి కేసు పెట్టిందని పోలీసు అధికారులు అంటున్నారు. రాత్రి సినిమా నటికి లైంగిక వేధింపులకు గురి చేసిన క్యాబ్ డ్రైవర్ మంజునాథ్ తిప్పేస్వామి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+