కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, బీ టీవీ సర్వే విడుదల, బెంగళూరు సగం సగం, రారాజులు ఎవరంటే!

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒక్కొక్క సర్వే విడుదల అవుతోంది. కర్ణాటక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, జేడీఎస్ నేతలకు సర్వేలు సినిమా చూపిస్తున్నాయి. తాజాగా కన్నడ టీవీ చానల్ బీ టీవీ విడుదల చేసిన సర్వే మీద జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటక శాసన సభ ఎన్నికలకు 48 గంటల సమయం కూడా లేని సందర్బంలో బీ టీవీ సర్వే విడుదల చేసింది.

ఐదు సీట్లు తేడా

ఐదు సీట్లు తేడా

పబ్లిక్ టీవీ, జన్ కి బాత్ సర్వేల అనంతరం బీ టీవీ కర్ణాటకలోని ప్రజల అభిప్రాయం సేకరించి సర్వే విడుదల చేసింది. పబ్లిక్ టీవీ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 94 సీట్లు, బీజేపీకి 84 సీట్లు, జేడీఎస్ కు 42 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు వస్తాయి. అయితే పబ్లిక్ టీవీ సర్వేకి ఐదు సీట్లు అటు ఇటు కావచ్చని బీ టీవీ సర్వే తెలిపింది.

హైదరాబాద్ కర్ణాటక

హైదరాబాద్ కర్ణాటక

బీ టీవీ సర్వే ప్రకారం హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు, బీజేపీకి 14 సీట్లు, జేడీఎస్ కు నాలుగు సీట్లు వస్తాయని బీ టీవీ సర్వే తెలిపింది. హైదరాబాద్ కర్ణాటకలో స్వతంత్ర పార్టీ అభ్యర్థుల ప్రభావం ఏమాత్రం ఉండదని బీ టీవీ సర్వేలో తేలింది.

ముంబై కర్ణాటకలో బీజేపీ హవా

ముంబై కర్ణాటకలో బీజేపీ హవా

ముంబై కర్ణాటకలో బీజేపీ హవాకు కాంగ్రెస్ పార్టీ విలవిలడుతోందని బీ టీవీ సర్వే తెలిపింది. ముంబై కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు, ప్రతిపక్ష బీజేపీకి 29 సీట్లు, జేడీఎస్ కు 2 సీట్లు వస్తాయని, స్వతంత్ర పార్టీ అభ్యర్థుల ప్రభావం ఉండదని బీ టీవీ సర్వే తెలిపింది.

సెంట్రల్ కర్ణాటక

సెంట్రల్ కర్ణాటక


సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలోపోటీ పడుతున్నాయి. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు, బీజేపీకి 10 సీట్లు, జేడీఎస్ కు 5 సీట్లు వస్తాయని, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కొన్ని నియోజక వర్గాలో గట్టిపోటీ ఇస్తున్నారని బీ టీవీ సర్వే తెలిపింది.

పాత మైసూరులో జేడీఎస్ కింగ్

పాత మైసూరులో జేడీఎస్ కింగ్

పాత మైసూరు ప్రాంతంలో 61 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ జేడీఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు సినిమా చూపిస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ పార్టీకి 30 సీట్లు వస్తాయని బీ టీవీ సర్వేలో వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు, బీజేపీకి 10 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని బీ టీవీ సర్వేలో వెలుగు చూసింది.

 కోస్తా కర్ణాటకలో పోటాపోటీ

కోస్తా కర్ణాటకలో పోటాపోటీ

కరావళి కర్ణాటక (కోస్తా కర్ణాటక)లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇస్తోంది. కోస్తా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వస్తాయి. ఇక్కడ జేడీఎస్ పార్టీ ప్రభావం ఏ మాత్రం లేదని, స్వతంత్రులు ఎలాంటి గట్టి పోటీ ఇవ్వడం లేదని బీ టీవీ సర్వే తెలిపింది.

బెంగళూరు రారాజులు

బెంగళూరు రారాజులు


బెంగళూరు నగరంలో 27 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గే అవకాశం ఉందని బీ టీవీ సర్వే తెలిపింది. బెంగళూరు నగరంలో కాంగ్రెస్ పార్టీకి 13 సీట్లు, బీజేపీకి 13 సీట్లు, జేడీఎస్ కు ఒక్క సీట్లు వస్తుందని బీ టీవీ సర్వే తెలిపింది. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ కు రెండు సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక్క సీటు ఇక్కడ ఆ పార్టీ చెయ్యి జారుతుందని బీ టీవీ సర్వే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+