కన్నడ సినీ హీరో నవీన్ దారుణ హత్య

బెంగళూరు: కన్నడ సినీ హీరో, నిర్మాత నవీన్ దారుణ హత్యకు గురైనాడు. మైసూరు నగరంలోని విజయనగర సమీపంలోని బెళవాడి మారమ్మ దేవాలయం సమీపంలో సోమవారం వేకువ జామున నటుడు నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం అర్థ రాత్రిదాటిన తరువాత నవీన్ హత్యకు గురైనాడు. విజయ నగర పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మైసూరు నగరంలోని బెళవాడి ప్రాంతంలోని మారమ్మ దేవాలయం దగ్గర నవీన్ ఇల్లు ఉంది. ఇతను అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి మారమ్మ దేవి ఉత్సవాలు, ఊరేగింపులు, పల్లకీలు జరిగాయి. ఆ సమయంలో నవీన్ ఉత్సవాలలో పాల్గొన్నాడు.

అర్థరాత్రి దాటిన తరువాత సుమారు ఆరు మంది నవీన్ మీద మారణాయుధాలతో దాడి చేశారు.అతను పారిపోకుండ జాగ్రతపడ్డారు. తీవ్రగాయాలై రక్తం ఎక్కువ పోవడంతో నవీన్ సంఘటనా స్థలంలో మరణించాడు. సోమవారం వేకువ జామున అటువైపు వెలుతున్న వారు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

kannada film actor naveen found murdered in mysuru

2012వ సంవత్సరంలో నవీన్ నటించిన ‘ హాయ్ కృష్ణ 'అనే సినిమా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు నవీన్ నిర్మాత. సినిమా అనుకున్న విధంగా విజయం సాదించకపోవడంతో నవీన్ నష్టపోయాడు. సినిమా నిర్మాణం కోసం ఇతను మైసూరులో చాల మంది దగ్గర అప్పులు చేశాడు. సరైన సమయంలో చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఒత్తిడి ఎక్కువ అయ్యింది.

2013వ సంవత్సరంలో హాయ్ కృష్ణ సినిమా హీరోయిన్ సుప్రియా తనను వంచన చేశాడని నవీన్ మీద మైసూరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. 2013వ సంవత్సరంలో నవీన్ మీద హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్రగాయాలైన నవీన్ మైసూరులోని కే ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.

ఒక సారి సాటి స్నేహితుడి మీద హత్యాయత్నం చేశాడని గతంలో నవీన్ మీద కేసు నమోదు అయ్యింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షల కారణంగా నవీన్ హత్యకు గురై ఉంటాడని మైసూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+