Puneeth Rajkumar no more: కన్నుమూసిన పవర్ స్టార్: ప్రాణం తీసిన జిమ్
బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర చికిత్స అందించినా..
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికీ.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంచినట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు.

రాజ్‌కుమార్ మూడో కుమారుడు..
గెలియా.. గెలియా.. అనే ఆ పాట సూపర్ హిట్. పునీత్ రాజ్‌కుమార్.. చందనసీమలో యంగ్ సూపర్ స్టార్. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌కు కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు.

యూత్‌లో క్రేజ్..
ఇక మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. పవర్ స్టార్‌గా పేరుంది. యూత్‌లో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన యువరత్న మూవీ తెలుగులోనూ విడుదలైంది. మంచి మూవీగా మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో కసరత్తు చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

జనసంద్రంగా ఆసుపత్రి.. ఆసుపత్రి వద్ద యడియూరప్ప..
ఈ సమాచారం అందుకున్న వెంటనే వేలాది మంది పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన క్షేమంగా బయటికి రావాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తోన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన అన్న శివరాజ్ కుమార్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ ఫేమ్ యష్ ఆసుపత్రికి చేరుకున్నారు. శాండల్‌వుడ్ మొత్తం ప్రస్తుతం ఆసుపత్రి వద్దే నిలిచింది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సూపర్ హిట్ మూవీస్..
నటసార్వభౌమ, చక్రవ్యూహ, రణవిక్రమ, దొడ్మనె హుడుగ, పవర్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్ రాజ్‌కుమార్. బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడి పాత్రలో నటించారు. అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

ఇంటి వద్ద భారీ బందోబస్తు..
పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారనే వార్త తెలిసిన వెంటనే కర్ణాటక వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టాప్ హీరోగా.. ఆయన కేరీర్ అత్యున్నత స్థితిలో ఉంది. వరుస సూపర్ హిట్స్‌తో శాండల్‌వుడ్ సినిమా స్థాయిని పెంచారాయన. ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కన్నుమూయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు ఆవేదనలో మునిగిపోయారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఇంటి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications