సుదీప్ సినిమాలో చెల్లిలి పాత్ర ఆశ చూపించి..యువతిపై కోరియోగ్రాఫర్ అత్యాచారం: మొబైల్ ఫోన్ నిండా..!
బెంగళూరు: సినిమాల్లో అవకాశాలను ఇప్పిస్తానంటూ ఓ కోరియోగ్రాఫర్ అపర కీచకుడిగా అవతారం ఎత్తాడు. ఓ యువతిని నిర్బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని చెర నుంచి తప్పించుకుని బయటపడిన బాధిత యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ డాన్స్ మాస్టర్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. సిలికాన్ సిటీ బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది.

రేపిస్ట్‌గా మారిన కోరియోగ్రాఫర్..
ఆ కోరియోగ్రాఫర్ పేరు పవన్. పలు రియాలిటీ షోలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరించాడు. బెంగళూరులోని నాగరబావి ప్రాంతంలో గల బీడీఏ కాంప్లెక్స్‌లో సొంతంగా ఓ డాన్స్ స్టూడియోను నిర్వహిస్తున్నాడు. బాధిత యువతి ఆరు నెలలుగా అతని వద్ద డాన్స్‌లో శిక్షణ పొందుతోంది. పవన్‌కు శాండల్‌వుడ్ పెద్దలతో కాస్తో, కూస్తో పరిచయాలు ఉన్నాయి. శాండల్‌వుడ్ టాప్ హీరో సుదీప్ నటిస్తోన్న తాజా సినిమాకు అతను పని చేస్తున్నాడు. దాన్ని అడ్డుగా పెట్టుకుని తన వద్ద శిక్షణ పొందుతోన్న యువతిని లోబరచుకున్నాడు.

సుదీప్‌కు చెల్లెలి పాత్రలో..
ఈ నెల 12వ తేదీన పవన్.. బాధితురాలికి ఫోన్ చేశాడు. సుదీప్ హీరోగా నటించే సినిమాలో చెల్లెలి పాత్ర ఉందని, ఈ పాత్రను ఇప్పిస్తానని ఆశ చూపించాడు. దీనికోసం ఆడిషన్స్‌లో పాల్గొనాల్సి ఉందని ఆమెను తన స్టూడియోకు పిలిపించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందును కలిపి, అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని అడ్డు పెట్టుకుని పలుమార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిర్బంధించి.. అత్యాచారం..
సంక్రాంతి సెలవుల్లో మూడు రోజుల పాటు ఆమెను స్టూడియోలో నిర్బంధించాడు. అతని చెర నుంచి తప్పించుకున్న బాధిత యువతి అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్‌ను అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్ నిండా అశ్లీల ఫొటోలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన కొన్ని ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. పవన్‌పై ఐపీసీ సెక్షన్ 354, 376 కింద కేసు నమోదు చేశారు. రిమాండ్‌కు తరలించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications