షాక్: ఒకే రోజు రెండు పార్టీలకు ప్రచారం చేసిన ప్రముఖ స్యాండిల్ వుడ్ హీరో, ఎందుకంటే!

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఈ సారి ప్రచారం చెయ్యడానికి స్యాండిల్ వుడ్ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ హీరో ఒకే రోజు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

 మైసూరులో హీరో హవా

మైసూరులో హీరో హవా

స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ హీరో రాకింగ్ స్టార్ యశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాను ఏ ఒక్క పార్టీ తరపున ప్రచారం చెయ్యను అంటూ ఇంతకాలం చెబుతూ వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రెండు ప్రముఖ పార్టీలకు ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు.

రాకింగ్ స్టార్ ఎఫెక్ట్

రాకింగ్ స్టార్ ఎఫెక్ట్

స్యాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యశ్ బుధవారం ఉదయం కేఆర్ నగర్ లో తోప్పమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. కేఆర్ నగర్ నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేస్తున్న సా.రా. మహేష్ ను గెలిపించాలని రాకింగ్ స్టార్ యశ్ ప్రజలకు మనవి చేశారు.

జేడీఎస్ కే మీఓటు

జేడీఎస్ కే మీఓటు

కేఆర్ నగర్ నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సా.రా. మహేష్ కు మద్దతుగా ఓపెన్ టాప్ జీపులో ఎండను లెక్కచెయ్యకుండా ప్రముఖ రహదారుల్లో రాకింగ్ స్టార్ యశ్ సంచరిస్తూ ప్రచారం చేశారు. సా.రా. మహేష్ ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాడని, ఓటు కచ్చితంగా ఆయనకే వెయ్యాలని రాకింగ్ స్టార్ యశ్ స్థానిక ఓటర్లకు మనవి చేశారు.

స్నేహం కోసం

స్నేహం కోసం

కేఆర్ నగర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాకింగ్ స్టార్ యశ్ తాను ఏ రాజకీయ పార్టీ కాని, ఆ పార్టీల సిద్దాంతాలకు అనుగుణంగా ప్రచారం చెయ్యడం లేదని అన్నారు. సా.రా. మహేష్ నా స్నేహితుడు, యువకుడు, ఆయన్ను గెలిపిస్తే మీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని రాకింగ్ స్టార్ యశ్ చెప్పారు.

సాయంత్రం బీజేపీ

సాయంత్రం బీజేపీ

రాకింగ్ స్టార్ యశ్ బుధవారం సాయంత్రం మైసూరులోని కేఆర్ (కృష్ణరాజ) నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేస్తున్న మాజీ మంత్రి రామదాస్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. మైసూరులోని గన్ హౌస్ సర్కిల్ నుంచి రాకింగ్ స్టార్ యశ్ రోడ్ షో నిర్వహించి రామదాస్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. స్యాండిల్ వుడ్ లో ప్రముఖ హీరోనే కాకుండా రాకింగ్ స్టార్ సొంత ఊరు మైసూరు కావడంతో ఆయనతో ప్రచారం చేయించడానికి వివిద పార్టీలు పోటీ పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+