సిద్దూకు సపోర్ట్ గా శివన్న, బాలయ్య విలన్, స్యాండిల్ వుడ్ బ్యూటీ ఎంట్రీ, సీన్ రిపీట్ తో !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ లో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లోని నెంబర్ వన్ స్థానంలో వరుణా నియోజక వర్గం ఉంది. మాజీ సీఎం సిద్దరామయ్య వరుణా నియోజక వర్గంలో పోటీ చెయ్యడంతో బీజేపీ నాయకులు ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో తాను చివరిసారిగా పోటీ చేస్తున్నానని, ఇక ముందు ఏ ఎన్నికల్లో పోటీ చెయ్యనని మాజీ సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. వరుణాలో మాజీ సీఎం సిద్దరామయ్యను కట్టడి చెయ్యాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్దరామయ్య మీద కర్ణాటక మంత్రి, లింగాయత్ నాయకుడు వి. సోమణ్ణను బీజేపీ రంగంలోకి దింపింది.

బీజేపీ నాయకుడు సోమణ్ణకు మద్దతుగా ఇప్పటికే స్టార్ హీరో కిచ్చా సుదీప్ వరుణాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు మాజీ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ వరుణా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడు అయిన శివరాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
డాక్టర్ శివరాజ్ కుమార్ తో పాటు కన్నడ స్టార్ హీరో, నందమూరి బాలక్రిష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విలన్ దునియా విజయ్, స్యాండిల్ వుడ్ బ్యూటీ, మాజీ ఎంపీ రమ్యా అలియాస్ దివ్యా స్పందన కూడా మాజీ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా వరుణా నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
వరుణా నియోజక వర్గంలో లింగాయత్ కులం ఓట్లు 55 వేలు ఉన్నాయి, ఇక సిద్దరామయ్య వర్గానికి చెందిన కురుబ ఓట్లు 35 వేలు ఉన్నాయి, ఎస్సీ ఓట్లు 43 వేల ఓట్లు, 23 వేల ఎస్టీ ఓట్లు, 12 వేల బీసీల ఓట్లు, ఇతరులు 12 వేల ఓట్లు ఉన్నాయి. లింగాయత్ వర్గానికి చెందిన సోమణ్ణ గెలుపు కోసం బీజేపీ నాయకులు అనేక లెక్కలు వేస్తున్నారు.
లింగాయత్ కులం ఓట్లు సాలిడ్ గా పడితే సోమణ్ణకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందని, ఇక ఇతర కులాల్లోని బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేస్తే సోమణ్ణ కచ్చితంగా విజయం సాధిస్తారని, సిద్దరామయ్య గెలుపు అంత సులభం కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. 2018లో మైసూరులో సిద్దరామయ్యను ఎలా ఓడించామో ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో కావాలని బీజేపీ నాయుకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications