బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు, స్యాండిల్ వుడ్ స్టార్స్ మద్దతు, మా హక్కు, బెంగళూరులో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలనే డిమాండ్ తో జరుగుతున్న పోరాటానికి స్యాండిల్ వుడ్ కు చెందిన అనేక ప్రముఖులు మద్దతు తెలిపారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ చాల సంవత్సరాల నుంచి ఉందని, ప్రతి ఒక్క కన్నడిగ ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని స్యాండిల్ వుడ్ ప్రముఖులు మనవి చేశారు.

ప్రముఖ హీరో, దర్శకుడు ఉపేంద్ర ఇప్పటికే ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కన్నడిగులకే స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ తో జరుగుతున్న పోరాటానికి సెంచురీ స్టార్, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ మద్దతు ప్రకటించారు.

 Kannada stars supports Karnataka Jobs For Kannadigas protest in Bengaluru

ఈ సందర్బంగా హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ కర్ణాటకలోని నేల ( భూమి), నీరు, ఉద్యోగాలతో పాటు ఏదైనా సరే కన్నడిగులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మంచి ఉద్దేశంతో కన్నడిగులకు న్యాయం జరిగే విదంగా జరుగుతున్న ఈ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హీరో శివరాజ్ కుమార్ చెప్పారు.

కన్నడిగులకు న్యాయం జరిగే విదంగా జరుగుతున్న ఈ పోరాటం విజయం సాధించాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని శివరాజ్ కుమార్ మనవి చేశారు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి తాను మనవి చేస్తున్నానని హీరో శివరాజ్ కుమార్ చెప్పారు.

సీనియర్ దర్శకుడు నాగతహళ్ళి చంద్రశేఖర్, నటుడు వశిష్ట, నెనపిరలి ప్రేమ్, జాతీయ అవార్డు గ్రహీత, నటుడు సంచారి విజయ్, చిక్కణ్ణ, కన్నడ పోరాట సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తదితర ప్రముఖులు కన్నడిగులకే స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలని జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ఆగస్టు 14, 15వ తేదీల్లో బెంగళూరులోని ఆనంద్ రావ్ సర్కిల్ లోని గాంధీ విగ్రహం ముందు జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొంటానని ప్రముఖ హీరో, దర్శకుడు ఉపేంద్ర ఇప్పటికే చెప్పారు. స్థానిక ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని జరుగుతున్న ఈ పోరాటానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని స్యాండిల్ వుడ్ ప్రముఖులు మనవి చేశారు.

English summary
Bengaluru: Kannada stars supports Karnataka Jobs For Kannadigas protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X