ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన కన్నడ నటి: అన్నంలో నిద్రమాత్రలు, సుత్తితో కొట్టి !

కన్నడ టీవీ సీరియల్ లో నటిస్తున్న మహిళ ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను అతిదారుణంగా హత్య చేసి చివరికి బెంగళూరు పోలీసులకు చిక్కిపోయింది. కన్నడ టీవీ సీరియల్ నటి కల్పనా, కన్నడ నటుడు జావేద్ అనే ఇద్దరిని అ

బెంగళూరు: కన్నడ టీవీ సీరియల్ లో నటిస్తున్న మహిళ ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను అతిదారుణంగా హత్య చేసి చివరికి బెంగళూరు పోలీసులకు చిక్కిపోయింది. కన్నడ టీవీ సీరియల్ నటి కల్పనా, కన్నడ నటుడు జావేద్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు.

చౌక అనే కన్నడ సినిమాలో జావేద్ నటించాడు. కల్పనా అనేక కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. కల్పనాకు ఇంతకు ముందే సతీష్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. సతీష్, కల్పనా దంపతులు బెంగళూరు నగరంలోని యశవంతపుర సమీపంలో నివాసం ఉంటున్నారు.

భర్త కంటపడింది !

భర్త కంటపడింది !

కల్పనా, జావద్ ల మద్య పరిచయం ఉంది. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. జావద్ ను విడిచిపెట్టి ఉండలేని స్థాయికి కల్పనా వ్యవహారం చేరింది. విషయం తెలుసుకున్న సతీష్ నీ పద్దతి మార్చుకోవాలని భార్య కల్పనాను హెచ్చరించాడు.

షూటింగ్ పేరుతో ప్రియుడితో జల్సా !

షూటింగ్ పేరుతో ప్రియుడితో జల్సా !

టీవీ సీరియల్ షూటింగ్ ఉందంటూ కల్పనా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లేది. తరువాత జావేద్ తో కలిసి జల్సా చేస్తూ భర్త సతీష్ కు మస్కా కొడుతూ వచ్చింది. భార్య విషయంలో సతీష్ చాల సీరియస్ అయ్యాడు. షూటింగ్ లకు వెళ్లకూడదని భార్య కల్పనాను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.

చంపేద్దాం అంటూ ప్రియుడితో !

చంపేద్దాం అంటూ ప్రియుడితో !

తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్త సతీష్ ను అంతం చెయ్యాలని కల్పనా ప్లాన్ వేసింది. తన భర్త సతీష్ ను హత్య చేస్తే ఇద్దరం సంతోషంగా ఉంటామని జావేద్ కు చెప్పింది. సతీష్ ను హత్య చెయ్యడానికి జావేద్ అంగీకరించాడు.

అన్నంలో నిద్రమాత్రలు !

అన్నంలో నిద్రమాత్రలు !

రాత్రి ఇంటికి వచ్చిన భర్త సతీష్ కు కల్పనా ముందుగానే నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది. భార్య మీద నమ్మకంతో భోజనం చేసిన సతీష్ మత్తులోకి జారుకున్నాడు. తరువాత ప్రియుడు జావేద్ కు ఫోన్ చేసిన కల్పనా అతన్ని ఇంటికి పిలుపించుకునింది.

సుత్తితో కొట్టి చంపేసింది

సుత్తితో కొట్టి చంపేసింది


ప్రియుడు జావేద్ తో కలిసి కల్పనా సుత్తి తీసుకుని నిద్రమత్తులో ఉన్న భర్త సతీష్ తల మీద దాడి చేసి దారుణంగా హత్య చేసింది. తరువాత తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందరినీ నమ్మించింది. కేసు నమోదు చేసిన యశవంతపురం పోలీసులు కల్పనా మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్త సతీష్ ను ప్రియుడు జావేద్ తో కలిసి హత్య చేశానని కల్పనా అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+