టీవీ యాంకర్ చందన్ దుర్మరణం: కొడుకు గొంతు చీల్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య, యాసిడ్!
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందడంతో జీవితంపై విరక్తి చెందిన భార్య కుమారుడిని అతి దారుణంగా హత్య చేసి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురంలో నివాసం ఉంటున్న వీణా (35) అనే మహిళ కుమారుడు తుషార్ (13)ను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

టీవీ యాంకర్
దోడ్డబళ్లాపురం పట్టణంలోని సోమేశ్వర కాలనీలో చందన్, వీణా దంపతులు వారి కుమారుడు తుషార్ తో కలిసి నివాసం ఉంటున్నారు. చందన్ కన్నడ టీవీ చానల్ లో యాంకర్ గా జీవనం సాగిస్తున్నాడు. చందన్ భార్య వీణా, కుమారుడు తుషార్ కు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటున్నాడు.

రోడ్డు ప్రమాదం
కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరహర తాలుకా హనగవాడి సమీపంలో మే 24వ తేదీ వేకువ జామున చందన్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీ ఢీకొనింది. ఈ ప్రమాదంలో యాంకర్ చందన్ దుర్మరణం చెందాడు.

జీవితంపై విరక్తి
భర్త చందన్ మరణించడంతో వీణా జీవితంపై విరక్తి పెంచుకునింది. ఎవ్వరితో మాట్లాడకుండా భర్తను తలుచుకుని కుమిలిపిపోయింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని వీణా నిర్ణయించింది. తాను ఆత్మహత్య చేసుకుంటే కుమారుడు తుషార్ అనాథ అవుతాడని వీణా ఆందోళన చెందింది.

కుమారుడి దారుణ హత్య
రాత్రి నిద్రపోతున్న కుమారుడు తుషార్ ను హత్య చేయాలని వీణా నిర్ణయించింది. కత్తి తీసుకుని కుమారుడు తుషార్ గొంతు కోసి దారుణంగా హత్య చేసిన వీణా తరువాత అదే కత్తితో ఆమె శరీరం మీద ఇష్టం వచ్చినట్లు కోసుకునింది. అనంతం వీణా ఇంటిలో ఉన్న యాసిడ్ తాగి కుప్పకూలిపోయింది.

ఫ్యామిలీ మొత్తం మృతి
గురువారం ఉదయం వీణా సోదరుడు చేతన్ వెళ్లి చూడగా తుషార్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్గి వీణాను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వీణాను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై వీణా మరణించిందని శుక్రవారం పోలీసులు చెప్పారు. ఒకే ఇంటిలో వారం రోజుల వ్యవదిలో ముగ్గురూ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications