khiladi: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను వదిలేసి నన్ను పట్టుకుంటారా ?, అందుకేనా మీకు జీతాలు !
బ్యాంకులను మోసం చేసిన వ్యక్తిని ఐదేళ్ల తరువాత పట్టుకున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు వేల కోట్ల రూపాయలు మోసం చేశారు, వాళ్లను మీరు ఏమీ చేయ్యకుండా వదిలేశారు. నేను ఎన్ని కోట్లు మోసం చేశాను ?,
బెంగళూరు/తుమకూరు: నగరంలోని వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులకు సమర్పించి కోట్లాది రూపాయలను మోసం చేస్తున్న ఖతర్నాక్ మోసగాడిని చాలా సంవత్సరాల తరువాత బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు వేల కోట్ల రూపాయలు మోసం చేసి తప్పించుకున్నారు. వాళ్లను మీరు ఏమీ చేయ్యకుండా వదిలేస్తున్నారు. నేను రూ. 4 కోట్లు మాత్రమే మోసం చేశాను, నేను మిమ్మల్ని మోసం చేయలేదు, నేను మోసం చేసింది బ్యాంకులను, ఈ విషయంలో మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారని నిందితుడు పోలీసులను ప్రశ్నించాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరులో గోల్ మాల్ లోకేష్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని తిపటూరు చెందిన లోకేష్ (43) అనే వ్యక్తిని బెంళూరులోని శేషాధ్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. 2018లో నిందితుడె లోకేష్ ప్లాట్లు కొనుగోలు చేస్తానంటూ ఓ వ్యక్తి నుంచి డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని వాటిని ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌బీఐ బ్యాంకులో ఇచ్చి ఆ ప్లాట్ మీద రూ. 83 లక్షలు రుణం తీసుకుని బ్యాంకు అధికారులను నిలువునా మోసం చేశారు.

ఐదేళ్లకు చిక్కాడు
బ్యాంకు అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో ఐదు సంవత్సరాల క్రితం శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి లోకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు లోకేష్ కు సహకరించిన అయూబ్, నాగరాజ్‌లను పోలీసులు అరెస్టు చేసి ఇప్పటికే జైలుకు పంపించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఈ కేసు కింగ్ పిన్ లోకేష్ ఐదేళ్ల తరువాత పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

భూములు కొంటామని దందాలు
గతంలో భూములు కొంటామని నమ్మించిన నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులకు ఇచ్చి రూ. కోట్ల రూపాయలు మోసం చేశారని వెలుగు చూసింది. బెంగళూరులోని విద్యారణ్యపుర, జిగణి, కేజీ నగర. శంకరాపురం తదితర పోలీస్ స్టేషన్లలో కేటుగాడు లోకేష్‌తో పాటు అతడికి సహకరించిన అయూబ్, నాగరాజ్ ల మీద కేసులు నమోదయ్యాయి. జిగణి పోలీసులు నిందితులను గతంలో అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులు బెయిల్ పొందిన తర్వాత కూడా భూములు కొనుగోలు చేస్తానంటూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేస్తూనే ఉన్నారని బెంగళూరు అధికారులు తెలిపారు.

పేపర్లలో ప్రకటనలు చూసి స్కెచ్ లు వేశాడు
నిందితుడు లోకేష్ పలు దిన పత్రికల్లో భూమి విక్రయాల ప్రకటనలు, ప్లాట్లపై అతికించిన ఫ్లాట్ ఫర్ సేల్ బోర్డుల్లో ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించాడు. మేము ప్లాట్లు కొంటామని సాకుతో వాళ్లకు ఫోన్లు చేసిన లోకేష్ వారితో మాట్లాడాడు. అనంతరం వారిని నేరుగా కలుసుకున్న లోకేష్ ప్లాట్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తరువాత ఫ్లాట్ ల యజమానులకు టోకన్ అడ్వాన్స్‌గా కేవలం 20 వేలు ఇచ్చి ఫ్లాట్ ల డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీని తీసుకుంటున్నాడు.

బ్యాంకు అధికారులకు కుచ్చుటోపి
తరువాత ఆ ఫ్లాట్ ల పత్రాలను ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించిన లోకేష్ తన సహచరులను ఆ ఫ్లాట్ అమ్మే వాడు ఒకడని, ఆస్తిని కొనుగోలు చేసేవారు ఒకరని నకిలీ పత్రాలలు తయారు చేసి బ్యాంకులో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లోకేష్ అతని అనుచరులు అయూబ్, నాగరాజ్ ను ఈ దందాలో వాడుకున్నాడు. కొనుగోలుదారుడి పేరిట బ్యాంకు ఖాతా తెరిచారు. బ్యాంకర్లు కూడా వాటిని అసలు పత్రాలు అని నమ్మి లక్షలు లక్షలు వారికి రుణం మంజూరు చేసేశారు. అనంతరం నిందితులు లోకేష్, నాగరాజ్, అయూబ్ బ్యాంక్ లోన్ వచ్చిన డబ్బులు పంచుకుని పరారయ్యారు.

డౌట్ రాకుండా ముగ్గురూ మూడు ఈఎంఐలు కట్టేశారు
బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలు రుణం తీసుకున్న తరువాత నిందితులు బ్యాంకు అధికారులకు ఎలాంటి డౌట్ రాకుండా, వెంటనే వారి వెంటపడకుండా జాగ్రత్తలు పడి వరుసగా మూడు నెలలు లోన్ ఈఎంఐలు చెల్లించారు. మూడు నెలల తరువాత ఈఎంలు కట్టకుండా రుణం ఇచ్చిన బ్యాంకు అధికారులకు కనపడకుండా తప్పించుకుని తిరిగారు. దెబ్బకు బ్యాంకు అధికారులు ఆ ఆస్తుల నిజమైన యజమానులకు బ్యాంకు నోటీసులు జారీ చేశారు.

అసలైన ఓనర్లకు బ్యాంక్ నోటీసులు
అప్పులు వసూళ్ల కోసం వాళ్ల ఇంటింటికి బ్యాంకు ప్రతినిధులను పంపించారు. ఈ సమయంలోనిజమైన ప్లాట్ యజమాని షాక్ కు గురై పోలీసు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో నిందితుడు లోకేష్ పాటు అతని స్నేహితులు నాగరాజ్, అయూబ్ కలిసి బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు లోన్ తీసుకుని, తరువాత రుణం తిరిగి చెల్లించకుండా మోసం చేశారని వెలుగు చూసింది.

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను వదిలేసి నన్ను పట్టుకుంటారా
ఐదు సంవత్సరాల తరువాత పోలీసులకు చిక్కిన లోకేష్ పోలీసులకే షాక్ ఇచ్చాడు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుని మోసం చేసి తప్పించుకుని దేశం విడిచి వెళ్లిపోయారు, వాళ్లను ఏమీ చేయకుండా ఇద్దరిని వదిలేశారు. ఇప్పుడు కేవలం నేను రూ. 3 నుంచి రూ. 4 కోట్లు మాత్రమే మోసం చేశాను, నేను మిమ్మల్ని (పోలీసులను) మోసం చేయలేదని, నేను మోసం చేసింది బ్యాంకులను, ఈ విషయంలో మీరు ఎందుకు పెద్దగా నా మీద ఆసక్తి చూపిస్తున్నారని లోకేష్ పోలీసులనే ప్రశ్నించాడని వెలుగు చూసింది. లోకేష్ లాజిక్ లతో పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications