నేటి నుంచే.. వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు సవరణ- అమలు
వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాల కోసం వినియోయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. సవరించిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఒక్కో సిలిండర్‌పై 200 రూపాయలకు పైగా తగ్గింది. వీటితో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా హోటళ్లు, డైనర్లు, ఇతర కమర్షియల్ వినియోగదారులకు కొంతమేర ఊరట లభించినట్టయింది.
వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాల కోసం వినియోయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. సవరించిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఒక్కో సిలిండర్‌పై 200 రూపాయలకు పైగా తగ్గింది. వీటితో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా హోటళ్లు, డైనర్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు, ఇతర కమర్షియల్ వినియోగదారులకు కొంతమేర ఊరట లభించినట్టయింది.

పండగల సీజన్ సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాపారులకు ఎంతగానో ఊరట ఇచ్చింది. వరుసగా రెండో నెలలో కూడా కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం విశేషం. ఈ రెండు నెలల కాలంలో కమర్షియల్ సిలిండర్ ధరలు దేశవ్యాప్తంగా భారీగా దిగివచ్చాయి. ఒక్క ఢిల్లీలోనే వీటి ధర మొత్తం రూ. 385.50 మేర తగ్గినట్టయింది.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై 202 రూపాయల మేర తగ్గింపు లభించింది. దీంతో సిలిండర్ ధర రూ. 2,930 నుండి రూ. 2,738 కి తగ్గింది. కోల్‌కతాలో ఈ తగ్గింపు 209 రూపాయలుగా నమోదైంది. దీంతో అక్కడ ఒక్కో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతానికి 2,872.50 రూపాయలకు తగ్గింది.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. వారికి ఇప్పుడు కూడా ఆశాభంగమే ఎదురైంది. 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పూ చేయలేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. జూన్ 7 నాటి ధరలే ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యుల నెలవారీ ఇంటి ఖర్చుల విషయంలో ఈ నిర్ణయం పెద్దగా సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయింది.
డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు ఢిల్లీలో రూ. 942.00, కోల్‌కతా-రూ. 968.00, ముంబై- రూ. 941.50, చెన్నై-రూ. 957.50లుగా కొనసాగుతున్నాయి.













Click it and Unblock the Notifications