ఫోన్ కోసం దుస్తులు విప్పించి సోదా: బాలిక ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొబైల్ ఫోన్ ఉందంటూ.. తన దుస్తులు విప్పించి సోదా చేయడాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు బాలిక దుస్తులు విప్పి సోదా చేయడంతో ఈ ఆరవ తరగతి విద్యార్థిని మనస్తాపం చెందింది.
స్థానిక బ్రహ్మనగర్‌లో నివసించే బాలిక పాఠశాలకు వెళ్ళింది. అయితే, స్కూల్‌కు సెల్‌ఫోన్ తీసుకువచ్చిందన్న అనుమానంతో వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆ బాలిక దుస్తులు విప్పి సోదా చేసింది. సెల్‌ఫోన్ లభ్యం కావడంతో టీచర్ మందలించింది. రెండు గంటలపాటు అలాగే నించోబెట్టింది.

దీంతో, తీవ్రంగా కలత చెందిన విద్యార్థిని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు విషయం చెప్పి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనంతరం ఆమె సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా దర్శనమిచ్చింది. దీంతో, తీవ్ర ఆగ్రహం చెందిన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఉషాదేవి మాట్లాడుతూ.. స్కూల్లోకి సెల్ ఫోన్లు తేవడం నిషిద్ధమని తెలిపారు. తాము బాలిక దుస్తులు విప్పి సోదా చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications