కాన్పూర్ జూ: గిన్నీస్ బుక్‌లోకి పెద్దపులి ‘గుడ్డు’

అందువల్ల ఈ విషయం గిన్నీస్ బుక్ అధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. వృద్ధాప్యం కారణంగా దంతాలన్నీ కోల్పోయిన ఈ పులికి కొంత కాలంగా ఎముకల్లేని మాంసం, విటమిన్లను ఆహారంగా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత వారం రోజుల నుంచి పులి ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసిందని, దీంతో బుధవారం కన్నుమూసిందని అధికారులు చెప్పారు.
2001లో ఛండీగఢ్ జూ నుంచి కాన్పూర్ జూకు ఈ పులిని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత లక్నో జూకు పంపించినట్లు తెలిపారు. కాన్పూర్ జూకు వచ్చిన సమయంలో ఆ పులి వయస్సు 13 అని అధికారులు చెప్పారు. లక్నో జూ నుంచి తిరిగి 2008లో కాన్పూర్ జూకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
గురువారం జూ అవరణలో గుడ్డుకు పోస్టుమార్టం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జైపూర్ జూలోని రాము (పులి పేరు) 24 ఏళ్లపాటు జీవించి 2010లో గుండె జబ్బుతో మృతి చెందిందని చెప్పారు. కాగా గతంలో అత్యధిక కాలంపాటు జీవించిన పులిగా ఫ్లోరిడాకు చెందిన ఫ్లెవియా(25ఏళ్లు) పేరిట రికార్డు ఉంది.












Click it and Unblock the Notifications