భర్త చేసిన ఒక్క కామెంట్‌తో రచ్చ రచ్చ.. చివరకు ఇద్దరు భార్యలు చేసిన పని వైరల్!
కలిసి ఉన్నంతసేపు సరదాగా నవ్వుకునేందుకు వేసిన ఓ చిన్నపాటి జోక్.. ఆ ఇంట్లో పెద్ద భయాందోళనలను, హంగామాను సృష్టించింది. భర్త చేసిన ఆ ఒక్క సరదా కామెంట్‌తో ఆగ్రహంతో ఊగిపోయిన రెండో భార్య.. ఈ వ్యవహారాన్ని ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మంధానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
మంధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఉద్యోగికి మొదటి భార్యతో సంతానం కలగకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కాగా కొన్ని రోజుల క్రితం గోరఖ్‌పూర్ నుంచి మొదటి భార్య పెళ్లికాని ఫ్రెండ్ ఒకరు ఇంటికి వచ్చింది. వరసకు మరదలితో నవ్వించే కామెడీ తరహాలోనే ఆ వ్యక్తి తన రెండో భార్య ముందే 'నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను' అంటూ ఆమెతో సరదాగా కామెంట్ చేశాడు.

అనుమానంతో రచ్చరచ్చ చేసిన రెండో భార్య
భర్త సరదాగా అన్న మాటలను రెండో భార్య తీవ్రంగా పరిగణించింది. తన భర్త నిజంగానే ఆమెను మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని గట్టిగా అనుమానించింది. దీంతో ఇంట్లో తీవ్ర స్థాయిలో గొడవ ప్రారంభమైంది. భర్త, మొదటి భార్య ఎంత నచ్చజెప్పినా, అది కేవలం ఒక జోక్ అంటూ విన్నవించినా ఆమె ఏ మాత్రం వినిపించుకోలేదు. వివాదం ముదిరిపోవడంతో బుధవారం రాత్రి మొదటి భార్య, రెండో భార్య, భర్త, గోరఖ్‌పూర్ స్నేహితురాలు నలుగురు కలిసి మంధాన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
పోలీసుల కౌన్సిలింగ్
పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ జై నారాయణ్ సింగ్ నలుగురిని ముఖాముఖి కూర్చోబెట్టి దాదాపు రెండు గంటల పాటు విచారించ కౌన్సిలింగ్ ఇచ్చారు. తనకు ఎలాంటి వివాహేతర సంబంధం లేదని.. ఊరికే సరదాగా మాత్రమే అన్నానని భర్త స్పష్టం చేయగా.. మొదటి భార్య కూడా తన సమ్మతితోనే రెండో పెళ్లి జరిగిందని.. మూడో పెళ్లి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపింది. గోరఖ్‌పూర్ వచ్చిన స్నేహితురాలు కూడా తాను తిరిగి ఇంటికి వెళ్తున్నానని స్పష్టం చేసింది.
పోలీసుల సమక్షంలో సదరు మహిళ అనుమానాలు పూర్తిగా నివృత్తి కావడంతో గొడవ సర్దుమనిగింది. పొరపాట్లు, అపోహలు తొలగిపోవడంతో నలుగురు నవ్వుతూ ఇంటికి తిరుగుపయనమయ్యారు. గురువారం నాడు ఇద్దరు భార్యలు కలిసి తమ భర్త నూరేళ్ల ఆయుష్షు కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో కర్వా చౌత్ వ్రతం ఆచరించడం విశేషం.












Click it and Unblock the Notifications
