Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాట్సప్ స్టేటస్ ఎఫెక్ట్: కర్ణాటకలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి: పోలీసులకు గాయాలు..తీవ్ర ఉద్రిక్తత

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి దిగాయి.. రాళ్ల వర్షాన్ని కురిపించాయి. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీనితో నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జహంగీర్‌పురిలో హనుమాన్ శోభాయాత్రపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన అనంతరం ఘర్షణలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును చేపట్టాయి. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిసేపటికే హుబ్లీలోనూ అలాంటి ఉదంతమే సంభవించింది.

Karnataka: 4 policemen including one inspector injured in the stone-pelting incident at Hubli

హుబ్లీలో చోటు చేసుకున్న ఘటనకు ప్రధాన కారణం- ఓ వాట్సప్ స్టేటస్. అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అభ్యంతరకరమైన వాట్సప్ స్టేటస్‌ను పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. కొద్దిసేపటికే రాళ్లతో దాడి చేశారు. బయటి నుంచి రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.

Karnataka: 4 policemen including one inspector injured in the stone-pelting incident at Hubli

ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే హుబ్లీ పోలీస్ కమిషనర్ లభు రామ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న హనుమాన్ ఆలయంపైనా రాళ్లదాడి సంభవించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

Karnataka: 4 policemen including one inspector injured in the stone-pelting incident at Hubli
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+