కన్నడ ఓటర్ల కన్నెర్ర.. ఓడిన సీఎం.. అదే బాటలో 13 మంది మంత్రులు
Recommended Video

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కన్నడ ఓటర్లు ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు 13 మంది మంత్రులపై కన్నెర్ర చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 13 మంది తమ సమీప ప్రత్యర్థుల చేతిలో వెనకంజలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజా ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి, అలాగే చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. కన్నడ ఓటర్ల తీర్పు మీడియాలో చర్చనీయాంశమైంది. ఓటమి దిశగా పయనిస్తున్న మంత్రులు జాబితా ఇదే..

హెచ్‌సీ మహాదేవప్ప (రోడ్లు, భవనాలశాఖ)
హెచ్‌ఎం రేవన్న (రవాణాశాఖ)
ఉమశ్రీ కన్నడ (సాంస్కృతిక శాఖ)
జయచంద్ర (న్యాయశాఖ)
కోలివాద్ (స్పీకర్)
కగోడ తిమప్ప (రెవెన్యూ శాఖ)
ఎస్ఎస్ మల్లికార్జున్ (ఉద్యావనశాఖ)
వినయ్ కులకర్ణి (మైనింగ్ శాఖ)
రామనాథ్ రాయ్ (అటవీశాఖ)
షరన్ ప్రకాశ్ పాటిల్ (వైద్య విద్యాశాఖ)
సంతోష్ లాడ్ (కార్మికశాఖ)
రుద్రప్ప లామని (చేనేతశాఖ)
ప్రమోద్ మద్వారాజ్ (క్రీడాశాఖ)












Click it and Unblock the Notifications