వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి సర్వే భయం, కర్ణాటకలో నరేంద్ర మోడీ హవా: 25 ర్యాలీలకు స్కెచ్, పక్కా ప్లాన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకులకు సర్వేల భయం పట్టుకుంది. ఒక్క శాతం ఓటు బ్యాంకు గల్లంతు అయినా ఆదేవుడు కూడా మనల్ని కాపాడలేడని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని మోడీతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయించి ఆయన హవాతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధాని మోడీ హవా కర్ణాటకలో పని చేస్తోందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Recommended Video

Amit Shah Calls BJP's Yeddyurappa 'Most Corrupt'
సర్వే దెబ్బతో భయం

సర్వే దెబ్బతో భయం

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఇప్పటికే కొన్ని సర్వేలు విడుదల అయ్యాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2018 శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి వస్తోందని సర్వేలు చెప్పడంతో బీజేపీ నాయకుల దిమ్మతిరిగింది.

ప్రభుత్వం డ్రామా

ప్రభుత్వం డ్రామా

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తోందని సిద్దరామయ్య ప్రభుత్వం తప్పుడు సర్వేలు చేయించి విడుదల చేయించిందని బీజేపీ నాయకులు బయటకు చెప్పినా లోలోపల మాత్రం వారు ఆందోళన చెందుతున్నారని సమాచారం.

ప్రధాని మోడీ ప్రభావం

ప్రధాని మోడీ ప్రభావం

కర్ణాటకలో ప్రధాని మోడీ ప్రచారం చేస్తే మనకు కలిసి వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీని ఎన్నికల ప్రచారానికి వీలైనన్ని ఎక్కువసార్లు రప్పించాలని కర్ణాటక బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.

10 పర్యటనలు 25 ర్యాలీలు

10 పర్యటనలు 25 ర్యాలీలు

కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం ముగిసే సమాయానికి ముందే ప్రధాని నరేంద్ర మోడీని 10 సార్లు కర్ణాటకకు పిలుచుకుని రావాలని బీజేపీ నాయకులు ప్లాన్ వేశారు. ప్రతి రోజు 2 లేదా 3 ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్లొనే విధంగా ప్లాన్ వేస్తున్నారు.

అమిత్ షా మకాం

అమిత్ షా మకాం

కర్ణాటక శాస నభ ఎన్నికల్లో ఎలాగైనా అధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని 40కు పైగా మఠాలు సందర్శించి మఠాధిపతుల మద్దతు కోరారు. కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో అమిత్ షా ప్రచారం చేస్తున్నారు.

English summary
Karnataka assembly elections 2018: With a few poll surveys suggesting that the Congress is ahead in Karnataka, the BJP has decided to have more of Narendra Modi in the campaign. He would address at least 25 rallies before the state goes to poll on May 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X