లింగాయత్ ఓటే కీలకం: వొక్కలిగల ప్లస్ ఓబీసీల మద్దతు కోసం బీజేపీ వ్యూహం..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: త్వరలో దక్షిణాదిన కర్ణాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో కీలకం. ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లోనూ వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాల ఓట్లు కీలకమయ్యేవి. కానీ ఈ దఫా ఒకింత తేడా ఉన్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో 9.8 శాతం మంది లింగాయత్‌లు ఉన్నారు. గత ఎన్నికల్లో కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధినేతగా బీఎస్ ఎడ్యూరప్ప పోటీ చేయడంతో బీజేపీ ఓటింగ్ చీలింది. ఇక 2006 - 2008 మధ్య బీజేపీ - జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు వికటించినా మళ్లీ ఎన్నికల తర్వాత పొత్తు కోసం ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
ఒంటరి పోరుకే తాము సిద్ధమని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి ప్రకటించినా... అసలు అధికారానికి దగ్గర కావడమనే వ్యూహం ఆయన అమలు చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వొక్కలిగలు 12 శాతం నుంచి 8.16 శాతానికి పడిపోయారు. ఇక దళితులు 18 శాతం ఉండటంతో అధికార కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న సీఎం సిద్దరామయ్య వారి కోసం రాయితీలు ప్రకటించారు.

వొక్కలిగ - లింగాయత్ గణాంకాల వివరాలపై కన్ ప్యూజన్ ఇలా

వొక్కలిగ - లింగాయత్ గణాంకాల వివరాలపై కన్ ప్యూజన్ ఇలా

ఇక సిద్దరామయ్య బీసీలకు కొన్ని పథకాలు అమలు చేస్తూ ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల వారిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటివరకు 50 శాతం గల రిజర్వేషన్లను 70 శాతానికి పెంచడానికి క్రుషి చేస్తానన్నారు. కానీ ఖచ్చితమైన హామీ ఇవ్వలేదు. అయితే వచ్చే నాలుగు నెలల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చేసిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందా? లేదా? అన్న సంగతి చూడాలి. లింగాయత్‌లకు ప్రత్యేక గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఇతర సామాజిక వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుందన్న సమస్య ఉంది. ఇక సిద్ధరామయ్య ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుల జన గణన రహస్యంగా అట్టిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాల జన గణన వివరాలు తొక్కి పడుతున్నదన్న అభిప్రాయం ఉన్నది. ఇటు లింగాయత్, అటు వొక్కలిగ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూర్చి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు సిద్దరామయ్య.

లింగాయత్ ఓటు చీలికతోనే 2013లో కాంగ్రెస్ పార్టీకి అధికారం

లింగాయత్ ఓటు చీలికతోనే 2013లో కాంగ్రెస్ పార్టీకి అధికారం

వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాల ప్రజలు బీజేపీ, సెక్యులర్ జనతాదళ్ (జేడీ-ఎస్) పార్టీల మధ్య చీలిపోయి ఉన్నారు. 2007లో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం లింగాయత్‌లు. ఈ దఫా ఐదేళ్ల తర్వాత కమలం పార్టీ విజయం సాధించాలంటే లింగాయత్‌ల మద్దతే కీలకం. కానీ 2013 ఎన్నికల్లో 15 శాతం ‘లింగాయత్' ప్రజల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ దఫా తమకు ప్రత్యేక గుర్తింపు ప్రకటించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. కానీ ఈ దఫా లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలే లేవు. తాజాగా దళితులు, బీసీల మనస్సు చూరగొనడంపైనే అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించింది. ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్న లింగాయత్ నేత బీఎస్ యెడ్యూరప్ప.. 2013 ఎన్నికల్లో కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) తరఫున పోటీ చేశారు. దీంతో లింగాయత్ ఓట్లు చీలిపోవడం వల్ల కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈ దఫా లింగాయత్ సామాజిక వర్గ ప్రజలు ఎటువైపు తిరుగుతారన్న సంగతి తేలాలంటే ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిందే మరి.

కుమారస్వామిపై ఆధిక్యత కోసం కమలనాథుల వ్యూహం

కుమారస్వామిపై ఆధిక్యత కోసం కమలనాథుల వ్యూహం

దీనికి తోడు మాజీ సీఎం ఎస్ఎం క్రుష్ణ కూడా తన రాజకీయ చరమాంకంలో రాష్ట్రంలో, కేంద్రంలో పలు పదవులు అనుభవించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం గమనార్హం. వొక్కలిగ సామాజిక వర్గాన్ని తమ అక్కున చేర్చుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఇటీవల వొక్కలిగలకు ప్రధాన కేంద్రం ఆదిఛుంచానాగిరి పట్టణంలోని పలువురు మత పెద్దల దీవెనలు అందుకున్నారు. కమలనాథులు లింగాయత్‌ల కంటే ఇతర సామాజిక వర్గాలపైనే ద్రుష్టి సారించారు. ఇక్కడ బీజేపీ వ్యూహంలో రెండు కోణాలు ఉన్నాయి. అందులో ఒకటి లింగాయత్ - వొక్కలిగ సామాజిక వర్గాల నుంచి జేడీఎస్ పార్టీకి గల ఓటుబ్యాంకును కొల్లగొట్టడం ద్వారా వొక్కలిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, ఆయన కుమారుడు - మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిపై పై చేయి సాధించడమే. వొక్కలిగలకు తాము సరైన ప్రత్యామ్నాయం అన్న సంకేతం ఇవ్వడమే కమలనాథుల ప్రధాన లక్ష్యం అని అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ చందన్ గౌడ అన్నారు.

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఎపిసోడ్ తో బీజేపీపై వొక్కలిగల ఆగ్రహం

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఎపిసోడ్ తో బీజేపీపై వొక్కలిగల ఆగ్రహం

జేడీఎస్ పార్టీలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి వొక్కలిగ సామాజికం నుంచి మంత్రి డీకే శివకుమార్ వంటి వారు ఉన్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ ఎన్నికయ్యేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తన రిసార్టులో బస ఏర్పాటు చేసినందుకు ఆదాయం పన్నుశాఖ అధికారుల దాడులను శివకుమార్ కుటుంబం ఎదుర్కొన్నది. దీంతో వొక్కలిగలంతా కేంద్రంలోని అధికార బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తదితర కాంగ్రెస్ నేతలు వొక్కలిగలు, ఓబీసీ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడంలో బిజీబిజీగా ఉన్నారు. సీఎం సిద్దరామయ్య కూడా అహిందా (మైనారిటీలు, వెనుకబడిన కులాలు, దళితుల) ఉద్యమంపైనే ఆధారపడ్డారు.

ఓబీసీల ఆకర్షణపై బీజేపీలో అంతర్గత విభేదాలు

ఓబీసీల ఆకర్షణపై బీజేపీలో అంతర్గత విభేదాలు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక మైనారిటీ హోదా కల్పించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. తద్వారా గుర్తింపు పొందని ఓబీసీ గ్రూపులను ఏకం చేయడానికి బీజేపీ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఓబీసీ సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవాలన్న బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ప్రత్యేకించి మాజీ సీఎం - కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప, శాసనమండలిలో విపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప మధ్య పచ్చగడ్డి వేస్తే మంట మండుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల తర్వాత పొత్తు కోసం జేడీఎస్ - బీజేపీ

ఎన్నికల తర్వాత పొత్తు కోసం జేడీఎస్ - బీజేపీ

‘లింగాయత్ - ఓబీసీ కాంబినేషన్ ఒకింత కష్ట సాధ్యమే. కానీ లింగాయత్ - వొక్కలిగలు కలవడం తేలిక' అని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ ప్రొఫెసర్ నరేంద్ర పణి చెప్పారు. లింగాయత్ - వొక్కలిగ సామాజిక వర్గాల మధ్య ఐక్యత సాధిస్తే 224 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల కమలనాథులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 2006లో బీజేపీ, జేడీఎస్ మధ్య విబేదాలు ఉన్నా మళ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయన్నారు. ప్రత్యేకించి సెక్యులర్ జనతాదళ్ ఎన్నికల అనంతర పొత్తులకు అనుకూలంగా ఉన్నదని పణి చెప్పారు.

కుల సమీకరణాల యత్నాలపై నోరు మెదుపని అధికార వర్గాలు

కుల సమీకరణాల యత్నాలపై నోరు మెదుపని అధికార వర్గాలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రానికి సీఎంగా లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాల వారే ఉన్నారు. అహిందా ఉద్యమంతో ముందుకు వచ్చిన సిద్దరామయ్య ఒక్కరే అందుకు మినహాయింపు. బయటకు లీకైన సమాచారం ప్రకారం 2015లో వెల్లడైన కుల గణన లెక్కల్లో లింగాయత్‌లు 15 - 16శాతం నుంచి తొమ్మిది, వొక్కలిగలు 14 నుంచి ఎనిమిది శాతానికి పడిపోయారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో దళితులు అత్యధికంగా 24 శాతం మంది ఉన్నారని అంచనా. ఈ నేపథ్యంలోనే ఎస్సీల మద్దతు కూడగట్టేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. కుల సమీకరణాల వార్తల లీకేజీపై మాట్లాడేందుకు అధికార వర్గాలు నిరాకరిస్తున్నాయి.

లింగాయత్‌లతో సఖ్యతకు ప్రధాని మోదీ ప్లాన్

లింగాయత్‌లతో సఖ్యతకు ప్రధాని మోదీ ప్లాన్

వొక్కలిగల దరి చేరేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, లింగాయత్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలు సాగించారు. వీరిద్దరి ప్రయత్నాలతో కర్ణాటక రాష్ట్ర కమలనాథులు కూడా చేతులు కలిపితే గెలుపు సాధ్యమేనన్న అభిప్రాయం ఉన్నది. గమ్మత్తేమిటంటే 2008 - 13 మధ్య బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీఎస్ ఎడ్యూరప్పతోపాటు ముగ్గురు సీఎంలు మారారు. ఒక బీఎస్ యెడ్యూరప్పపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ కంపెనీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.అయినా బీజేపీని అధికారంలోకి తేవడానికి అమిత్ షా, నరేంద్రమోదీ జోడీ శత విధాల ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The caste equations in the Karnataka assembly elections 2018 would be crucial. While during every election, it is the Vokkaliga and Lingayat vote banks that are spoken about. However, this time around there is a difference.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి