కర్ణాటకకు వెళ్తోన్నారా?- బీ అలర్ట్

బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకేదఫాలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఉదయం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనట్లు ప్రకటించారు. ఇవ్వాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చింది.

ఈ క్రమంలో- కర్ణాటక సరిహద్దుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 30 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 19 జిల్లాలు- ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలతో సరిహద్దులను పంచుకుంటోన్నాయి. అందులో ఆరు జిల్లాలు రెండు రాష్ట్రాలతో, మిగిలిన 13 జిల్లాలు ఒకే రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటోన్నాయి. ఈ 19 జిల్లాల్లో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా 171 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

Karnataka Assembly elections 2023: EC have seized Rs 35 lakhs in cash at a checkpost on the first day

ఇదివరకే ఉన్న ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్, అటవీ శాఖ చెక్ పోస్టులను మరింత బలోపేతం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆయా చెక్‌పోస్టుల మీదుగా కర్ణాటకలో ప్రవేశించే అన్ని వాహనాలను కూడా విస్తృతంగా తనిఖీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు కూడా. భారీ మొత్తంలో నగదు, మద్యం బాటిళ్లు, ఆయుధాలు ఉంటే వాటిని నిర్ద్వందంగా స్వాధీనం చేస్తారు అధికారులు.

నగదు పట్టుబడితే- దానికి సరైన రశీదులు, ఇతర పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అవి ఉన్నా కూడా అప్పటికప్పుడు నగదును తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వరు. తొలి రోజే- కర్ణాటక సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో నగదును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా. కలబురగి జిల్లాలోని సేడం వద్ద 35.50 లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తోన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేంత వరకూ ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. సరిహద్దులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ సోదాలు ఉంటాయని, ప్రజలు సహకరించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో నగదును తమవెంట తీసుకెళ్లడాన్ని నివారించుకోవాలని, సరైన డాక్యుమెంట్లు లేకపోతే క్యాష్ ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+