బెంగళూరు ఇలా ఉంటుందా: గిజగిజలాడే నగరం నిశబ్దం, నిర్మానుష్యం, పోలీసులు హాయిగా!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక బంద్ సందర్బంగా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే బెంగళూరు నగరం బోసిపోయింది. గమ్యం చేరుకోవాలంటే గంటల కొద్ది ట్రాఫిక్ లో చిక్కుకునే ప్రజలు గురువారం ఊపిరిపీల్చుకున్నారు. బెంగళూరు నగరంలోని రహదారులు మొత్తం నిర్మాణుషంగా మారిపోయాయి. ప్రయివేటు వాహనాలు సైతం రోడ్ల మీద కనిపించలేదు. చిన్నచితకాగా అక్కడక్కడ కొన్ని ఆటోలు, కార్లు, బైక్ లు దర్శనం ఇచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

బెంగళూరు మొత్తం ఖాళీ
బెంగళూరు నగరంలోకి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బంద్ చేస్తున్న వారు ఎక్కడ మా వాహనాల మీద దాడి చేస్తారో అనే భయంతో ప్రజలు వారి సొంత వాహనాలు బయటకు తీసుకురావడానికి వెనకడుగు వేశారు.

మెజస్టిక్ ఇలా ఉంటుందా!
వేల సంఖ్యలో సంచరించే బీఎంటీసీ బస్సులు (బెంగళూరు సిటీ సర్వీసులు) ఒక్కటి కూడా గురువారం బయటకు రాలేదు. గురువారం ఉదయం అన్ని బస్సులను అధికారులు డిపోలకు తరలించాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో మెజస్టిక్ బస్టాండ్ ఖాళీగా దర్శనం ఇచ్చింది.

బెంగళూరు రహదారులు
బెంగళూరు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు గురువారం బోసిపోయాయి. బంద్ నిర్వహకుల ద్విచక్ర వాహనాలు మినహా దాదాపు 90 శాతం వాహనాలు రోడ్డ మీదకు రాలేదు. బెంగళూరు నగరంలో ఎవ్వరూ ఊహించని విధంగా బంద్ కు సంపూర్ణ మద్దతు వచ్చింది.

ట్రాఫిక్ సిగ్నల్స్!
బెంగళూరు నగరంలో నిత్యం వాహనాల రద్దీతో గిజగిజలాడే రహదారులు నిర్మాణుషంగా దర్శనం ఇచ్చాయి. నిమిషానికి ఒక్కసారి పడే ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. గంటల కొద్ది ప్రయాణించే వాహనచోదకులు నిమిషాల వ్యవదిలో గమ్యం చేరుకుంటున్నారు.

పోలీసులు రిలాక్స్
బెంగళూరులో నిత్యం కాలుష్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి ఉండే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక బంద్ సందర్బంగా ఊపిరిపీల్చుకుంటూ కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు వచ్చే వాహనాలు చూసుకుంటూ నిత్యం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందని అని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications