ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ- బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికల జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవ్వాళ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనట్లు ప్రకటించారు. ఇవ్వాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చింది.

షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లో బెంగళూరులో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. కాగడాల ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. కాగడాలను చేత పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. నల్ల బ్యానర్లను ప్రదర్శించారు.

Karnataka: Bengaluru Police disperse the Youth Congress leaders who were carrying out protest

ఈ కాగడాల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులు దారి తీసింది. ర్యాలీగా తరలి వెళ్తోన్న సమయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై డౌన్ డౌన్ అంటూ నినదించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఎలుగెత్తారు. అదాని అంశాన్ని ప్రశ్నిస్తోన్నందుకే భారతీయ జనతా పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

Karnataka: Bengaluru Police disperse the Youth Congress leaders who were carrying out protest

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వారిని వారించినప్పటికీ వినిపించుకోలేదు. బలవంతంగా రోడ్డుపై నుంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు పక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ర్యాలీని కొనసాగించి తీరుతామంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం వైపు బయలుదేరడానికి ప్రయత్నించారు.

Karnataka: Bengaluru Police disperse the Youth Congress leaders who were carrying out protest

దీనితో పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జీ చేశారు. అయినప్పటికీ- అక్కడి నుంచి కదలకపోవడంతో వాటర్ క్యానన్లను వారిపై ప్రయోగించారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూత్ కాంగ్రెస్ నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+