బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !
బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
కర్ణాటకలోని గదగ్ లోని విద్యానగర్ లోని కనకదాస శిక్షణా సంస్థ (కేఎస్ఎస్) కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని బీజేపీ నాయకుడు రవి దండిన విద్యాసంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కనకదాస విద్యాసంస్థల కార్యదర్శి రవి దండిన.

బెంగళూరు, గదగ్, హుబ్బళి, గోవాలో ఏక కాలంలో 10 చోట్ల రవి దండినకి చెందిన నివాసాలు, విద్యాసంస్థలు, హోటల్స్ మీద దాడులు చేసి వివరాలు సేకరించారు. బీజేపీ నాయకుడు రవి దండిన ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి.
బీజేపీ నాయకుడు రవి దండిన ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు సంపాధించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు రవి దండిన నివాసాలు, శిక్షణా సంస్థలు, హోటల్స్ మీద దాడులు చేసి అనేక విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారని తెలిసింది.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications