ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రముఖ వ్యాపారవేత్త మృతి
ఉగ్రవాదుల కాల్పుల్లో కర్నాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు మృతి చెందడం సంచలనంగా మారింది. పహల్గామ్‌లో జరిగిన ఈ దారుణమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మందిలో మంజునాథ్ రావు కూడా ఉన్నారు. ఆయన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది.
మంజునాథ్ రావు తన భార్య పల్లవి ,కుమారుడు అభిజయ్‌తో కలిసి కాశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. ఈ ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. భార్య పల్లవి కళ్ళ ముందే భర్త మరణించడాన్ని చూసి తీవ్రంగా కుంగిపోయారు.

ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంజునాథ్ రావు మృతికి సంతాపం తెలిపారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందించడానికి కర్ణాటక ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, సహాయక చర్యల కోసం ఒక బృందాన్ని కాశ్మీర్‌కు పంపించారు. మంజునాథ్ రావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications