దేవుడా, ఉప ఎన్నికల ఫలితాలకు ముందే సీఎంకు ట్రబుల్ షూటర్ అడ్వాన్స్ విషెస్, కాంగ్రెస్ కు షాక్ !

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడకు కొన్ని గంటల ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ శుభాకాంక్షలు (అడ్వాన్స్ విషెస్) చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. సీఎం యడియూరప్ప ఎక్కడ ఉన్నా ఆయనకు మంచి జరగాలని, ఆయన ఎప్పుడూ బాగుండాలి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేత డీకే. శివకుమార్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, జేడీఎస్ పార్టీ నేతలు షాక్ కు గురైనారు. ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో ప్రకటించనున్న సమయంలో ఏ ఉద్దేశంతో సీఎం యడియూరప్పకు కాంగ్రెస్ నేత డీకే. శివకుమార్ అడ్వాన్స్ విషెస్ చెప్పారు ? అనే విషయం అంతు చిక్కడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

 ఇంటలిజెన్స్ రిపోర్టు !

ఇంటలిజెన్స్ రిపోర్టు !

ఇంటలిజెన్స్ అధికారుల నివేదిక ప్రకారం కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో తాము 13 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని ఆ రాష్ట్ర సీఎం బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే ఒక్క రోజు ముందు (ఆదివారం) సీఎం యడియూరప్ప పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలం చేరుకుని శ్రీ మంజునాథ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

 సీఎంకు అడ్వాన్స్ విషెస్

సీఎంకు అడ్వాన్స్ విషెస్

ఇంటలిజెన్స్ అధికారుల నివేదిక ప్రకారం కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో తాము 13 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని ఆ రాష్ట్ర సీఎం బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్తం చేసిన సందర్బంగా కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్పందించారు. సీఎం యడియూరప్పకు అంతా మంచి జరగాలని తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు షాక్ కు గురైనారు.

ఉప ముఖ్యమంత్రి సవాల్

ఉప ముఖ్యమంత్రి సవాల్

రామనగర జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని, రామనగర నియోజక వర్గంలో బీజేపీ జెండాలు రెపలరెపలాడేలా చూస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ సవాల్ చేశారు. రామనగర ఎన్నికల్లో గతంలో హెచ్ డీ. దేవేగౌడ (మాజీ ప్రధాని,) పీజీ. ఆర్ సింథ్యా ఎమ్మెల్యేలు అయ్యారని, ప్రస్తుతం హెచ్.డీ. కుమార్ స్వామి (మాజీ సీఎం) కుమారస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారని డీకే. శివకుమార్ గుర్తు చేశారు. అక్కడ మావల్ల కాని పని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ చేస్తామని సవాలు చేశారని, ఆయకు అంతా మంచి జరగాలని తారు కోరుకుంటున్నానని మాజీ మంత్రి డీకే. శివకుమార్ వ్యంగంగా అన్నారు.

 నమ్మక ద్రోహులకు చాన్స్

నమ్మక ద్రోహులకు చాన్స్

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు వెన్నుపోటు పొడిచిన అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ అవకాశం ఇచ్చిందని, అయితే ఇదే సమయంలో మాజీ మంత్రులు రోషన్ బేగ్ (కాంగ్రెస్), ఆర్. శంకర్ (స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే)కి మాత్రం అవకాశం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు.

సోనియా, రాహుల్ కు షాక్

సోనియా, రాహుల్ కు షాక్

అనర్హత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప అంటున్నారని, ఇవ్వమని చెప్పండి చాలా మంచిది అని మాజీ మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి, సీఎం యడియూరప్పకు మాజీ మంత్రి డీకే. శివకుమార్ అడ్వాన్స్ విషెస్ చెప్పడంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చినట్లు అయ్యిందని, ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+