ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు: తేనెతుట్టెను కదిపిన సీఎం

Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ చర్య పట్ల భారతీయ జనతా పార్టీ భగ్గుమంటోంది. ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న కర్ణాటక పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (కేటీపీపీ) చట్టాన్ని సవరించాల్సి ఉంది. దీనికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కేటీపీపీ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. సోమవారం నాటి సమావేశం సందర్భంగా ఈ సవరణల బిల్లు అసెంబ్లీ సమక్షానికి రావొచ్చు.

ఈ నెల 7వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో ముస్లి కాంట్రాక్టర్లకు నాలుగు రిజర్వేషన్ అమలు చేస్తామని, కేటగిరీ-2 బీ కింద వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు.

Siddaramaiah

ఈ బిల్లును శాసన సభ యధాతథంగా ఆమోదిస్తే- ప్రభుత్వ శాఖలు, విభాగాలు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల ద్వారా కోటి రూపాయల వరకు నిర్వహించే పనులు, వస్తువుల కొనుగోళ్లు, ఇతర పబ్లిక్ వర్క్స్‌లల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలవుతుంది.

ప్రస్తుతం ఇందులో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ అమలులో ఉంటోంది. కేటగిరీ-1, కేటగిరీ-2 ఏ కింద ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు. దీనికి అదనంగా కేటగిరీ- 2 బీలో ముస్లిం కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లును కల్పించడానికి సిద్ధరామయ్య సర్కార్ రంగం సిద్ధం చేసినట్టయింది.

ఈ-ఖాతా కోసం ఎదురుచూస్తోన్న వారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆమోదం పొందిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ-ఖాతా అమలు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలియజేసింది. ప్రస్తుతం బెంగళూరు వంటి కొన్ని నగరాల్లో మాత్రమే ఇది అమలులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+