సీఎంకు పిచ్చాసుపత్రిలో చికిత్స చెయ్యాలి: బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప, ప్రతిపక్షం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రాయచూరు జిల్లాలో కార్మికుల మీద ప్రవర్తించిన తీరుపై ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలైనాయి. ఇదే సమయంలో కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నాయకులు సైతం సీఎం కుమారస్వామి మీద విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కుమారస్వామికి సహనం అవసరం, సహనం లేని సీఎం కుమారస్వామి గ్రామవాస్తవ్యం కార్యక్రయం చేపట్టినా ఫలితం ఉండదని బెళగావి జిల్లాలోని రాయభాగ శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఐహాళె దుర్యోధన మహాలింగప్ప అన్నారు.

బెళగావిలో మీడియాతో మాట్టాడిన బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప సీఎం కుమారస్వామి మీద విరుచుకుపడ్డారు. సీఎం కుమారస్వామికి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయనకు ప్రస్తుతం పిచ్చాసుపత్రిలో చికిత్స అవసరం అని బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప అన్నారు.
సీఎం కుమారస్వామిని వెంటనే ధారవాడలోని పిచ్చాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప డిమాండ్ చేశారు. సీఎం కుమారస్వామి గ్రామవాస్తవ్యం కార్యక్రమం బదులు ధారవాడలోని పిచ్చాసుపత్రిలో వాస్తవ్యం ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప సూచించారు.
సీఎం కుమారస్వామి కొంత కాలం ధారవాడలోని పిచ్చాసుపత్రిలో చికిత్స చేయించుకుంటే అన్ని సర్దుకుంటాయని బీజేపీ ఎమ్మెల్యే దుర్యోధన మహాలింగప్ప వ్యంగంగా అన్నారు. రాయచూరు జిల్లాలోని కరెగుడ్డద గ్రామం సమీపంలో కార్మికుల మీద సీఎం కుమారస్వామి విరుచుకుపడిన విషయం తెలిసిందే. సీఎం కుమారస్వామి తీరుపై అనేక విమర్శలు మొదలైనాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications