హైప్రొఫైల్ మర్డర్: అక్రమ సంబంధం: గర్భంతో ఉన్న భార్యను మట్టుబెట్టిన డాక్టర్: రైలు కింద పడి.. !
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఓ హైప్రొఫైల్ మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన భార్యను హత్య చేసిన ఆరు రోజుల తరువాత నిందితుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అరెస్టు భయంతో. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు రైలు పట్టాల వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా- వారి పిల్లలు అనాథలయ్యారు. పైగా హత్య సమయంలో ఆ మహిళ గర్భంతో ఉందని పోలీసులు నిర్ధారించారు.

దంత వైద్యుడిగా మంచి పేరు..
కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా కడూర్‌లో ఓ మహిళ తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి పేరు కవిత. తన భర్త డాక్టర్ రేవంత్, పిల్లలతో కలిసి కడూర్‌లో నివసిస్తున్నారు. రేవంత్.. దంత వైద్యుడు. కడూర్ సమీపంలోని బిరూర్‌లో క్లినిక్‌ను నడిపిస్తున్నాడు. రేవంత్, కవితలకు ఏడేళ్ల కిందట వివాహమైంది. కవిత స్వస్థలం ఉడుపి. వివాహం అనంతరం దంపతులు కడూర్‌లో నివసిస్తున్నారు.

17న దారుణహత్య.. దోపిడీ దొంగల పనిగా అనుమానం..
ఈ నెల 17వ తేదీన కవిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణహత్యకు గురయ్యారు. గొంతు కోసి హత్య చేశారు. తొలుత ఈ హత్యను దోపిడీ దొంగలు చేసి ఉండొచ్చని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ దోపిడీ దొంగలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనడానికి పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. హతురాలి ఇళ్లు ప్రధాన రహదారికి ఆనుకునే ఉండటం, 24 గంటలూ వాహనాల రాకపోకలు సాగించే చోట దోపిడీ దొంగలు ఈ దారుణానికి పాల్పడే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. దీనితో దర్యాప్తు తీరును మార్చారు. కుటుంబ సభ్యుల మీద నిఘా వేశారు.

పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం..
కవిత పోస్టుమార్టమ్ నివేదికతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు కవితకు నిద్రను తెప్పించే ఇంజిక్షన్ ఇచ్చినట్లు ఈ నివేదికలో తేలింది. దీనితో పోలీసులు డాక్టర్ రేవంత్‌పై నిఘా వేశారు. పలుమార్లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినప్పటికీ.. ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించలేకపోవడంతో అతణ్ని అరెస్టు చేయలేకపోయారు. పోస్టుమార్టమ్‌లో వారి అనుమానాలు నిజమయ్యాయి. ఇంజిక్షన్ ఇచ్చే సామర్థ్యం డాక్టర్ రేవంత్ ఒక్కడికే ఉండటంతో అతణ్ని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అరెస్టు భయంతో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఉదయం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అక్రమ సంబంధమే కారణమంటూ..
తన భార్యను డాక్టర్ రేవంత్ హత్య చేయడానికి అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా రేవంత్.. తాను అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్న మహిళతో గడిపాడని తేలింది. ఈ విషయం కవితకు తెలియడంతో ఆమె నిలదీసిందని, అప్పటి నుంచి వారి మధ్య మూడు రోజుల పాటు ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. దీనితో విసుగెత్తిపోయిన రేవంత్.. తన భార్యను పిల్లల ముందే గొంతు కోసి హత్య చేశాడని, అనంతరం దాన్ని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని వెల్లడించారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications