Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tension: బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్ముంటే పోతా, అయోమయంలో మోదీ, అమిత్ షా !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను కచ్చితంగా మార్చుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా ఆ విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారని, వారు ఇప్పుడు అయోమయంలో ఉన్నారని తెలిసింది.

ఆదివారమే సీఎం పదవి నుంచి బీఎస్. యడియూరప్పను తప్పిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. నేను రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని, ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను, నా బ్యాగ్ రెఢీగా ఉంది అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇప్పటికే తేల్చి చెప్పారు. యడియూరప్పను తప్పిస్తే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏమిటి ?, బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉంటుందా ? ఉండదా అని కొందరు బీజేపీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో తమకంటు ముద్ర వేసుకున్న స్వామీజీలు ఏకంగా 500 మందికి పైగా బీఎస్. యడియూరప్పకు మద్దతు ఇస్తూ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో బలప్రదర్శనకు దిగడంతో బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రి మార్పు విషయంలో చివరి నిమిషంలో ఆలోచనలో పడిందని తెలిసింది.

 సస్పెన్స్..... థ్రిల్లర్.... స్పెషల్ ఎఫెక్ట్

సస్పెన్స్..... థ్రిల్లర్.... స్పెషల్ ఎఫెక్ట్

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఢిల్లీ నుంచి తనకు ఎప్పుడైనా ఫోన్ రావచ్చు, నేను రాజీనామా చెయ్యోచ్చు అంటూ కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ఇప్పటికే మీడియా ముందు క్లారిటీ ఇచ్చేశారు. సీఎం చెప్పిన గడుపు దగ్గర పడటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ యడియూరప్ప వర్గీయులు సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లు టీవీల ముందు కుర్చుకుని టెన్షన్ టెన్షన్ గా వార్తలు చూస్తున్నారు.

 ఆలోచనలో పడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా ?

ఆలోచనలో పడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా ?

కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను కచ్చితంగా మార్చుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా ఆ విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారని, ప్రస్తుతం హైకమాండ్ పెద్దలు అయోమయంలో ఉన్నారని తెలిసింది. ఒకసారి సీఎంను మార్చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత జరగబోయే పరిణామాలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లెక్కలు, అంచనాలు వేస్తున్నారని సమాచారం.

 నా బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా

నా బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా

నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని, ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను, నా బ్యాగ్ రెఢీగా ఉంది అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అంటున్నారు. సోమవారం బీజేపీ హైకమాండ్ నుంచి తనకు సందేశం వచ్చే అవకాశం ఉంది, సీఎంగా కొనసాగు అంటే తనపని తాను చేసుకుంటూ వెలుతానని, రాజీనామా చెయ్యమంటే నిమిషం కూడా వేరే విషయం ఆలోచించకుండా సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని బీఎస్. యడియూరప్ప కుండలు బద్దలుకొట్టి చెప్పేశారు.

 ప్రభుత్వానికి ఎఫెక్ట్ ?

ప్రభుత్వానికి ఎఫెక్ట్ ?

ఆదివారమే సీఎం బీఎస్. యడియూరప్పను తప్పిస్తారని జోరుగా మీడియాలో ప్రచారం జరిగింది. నేను రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని ఇప్పటికే సీఎం బీఎస్. యడియూరప్ప క్లారిటీ ఇచ్చేశారు. అయితే కర్ణాటక రాజకీయాలు గంటగంటలకు టెన్షన్ టెన్షన్ గా ఉండటంతో బీజేపీ కార్యకర్తలు, కన్నడిగులతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు కర్ణాటక రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు.

Recommended Video

    Karnataka Politics Audio Clip Leaked In Karnataka Increase Heat Over CM Yediyurappa Resign Issue
     ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందా ?

    ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందా ?

    బీఎస్. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏమిటి ?, మరో నాయకుడు ముఖ్యమంత్రి అయితే కర్ణాటకలో బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉంటుందా ? ఉండదా ? అని కొందరు బీజేపీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. సీఎం మారిపోతే ఆపరేషన్ కమలాతో బీజేపీలోకి జంప్ అయిన కొందరు ఎమ్మెల్యే మళ్లీ కాంగ్రెస్ లోకి జంప్ అయితే పరిస్థితి ఏమిటి ? అని బీజేపీ నాయకులే ఆలోచిస్తున్నారు.

     యడియూరప్పకు 500 మంది స్వామీజీల మద్దతు

    యడియూరప్పకు 500 మంది స్వామీజీల మద్దతు

    కర్ణాటక రాజకీయాల్లో తమకంటు ముద్ర వేసుకున్న స్వామీజీలు ఏకంగా 500 మందికి పైగా బీఎస్. యడియూరప్పకు మద్దతు ఇస్తూ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో బలప్రదర్శనకు దిగారు. బీఎస్. యడియూరప్పను సీఎంగా కొనసాగించాలని, లేదంటే కర్ణాటకలో బీజేపీ సర్వనాశనం అవుతుందని ఇప్పటికే స్వామీజీలు శాపనార్తాలు పెట్టారు. స్వామీజీలు అందరూ యడియూరప్పకు మద్దతుగా ఏకం కావడంతో బీజేపీ హైకమాండ్ కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఆలోచనలో పడిందని తెలిసింది.

     టెన్షన్..... టెన్షన్

    టెన్షన్..... టెన్షన్

    కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ లోకి వచ్చిన తరువాత కర్ణాటక సీఎంను మార్చాలని వేచి చూసిన బీజేపీ హైకమాండ్ ఇప్పడు అన్నిరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. మొత్తం మీద ఎప్పుడు ఏమి జరుగుతుందో ? అని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు బీజేపీ కార్యకర్తలు టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+