లేజీ సీఎం, స్టార్ హీరో అల్లుడికి వార్నింగ్ ఇచ్చిన సీఎం, నోరు అదుపులో పెట్టుకో, క్షమించండి!

బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ తరువాత అంతక్రేజ్ ఉన్న నటుడు దివంగత హీరో డాక్టర్ విష్ణవర్దన్. విష్ణువర్దన్ అల్లుడి మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కన్నెర్ర చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికి మంచిదని సీఎం హెచ్.డి. కుమారస్వామి హెచ్చరించారు.

లేజీ సీఎం

లేజీ సీఎం

దివంగత నటుడు డాక్టర్ విష్ణువర్దన్ అల్లుడు, నటుడు అనిరుద్ మీడియాతో మాట్లాడుతూ విష్ణువర్దన్ మరణించి దాదాపు 9 ఏళ్లు అవుతోందని, ఇంతవరకు స్మారక నిర్మాణం పనులు పూర్తి చెయ్యలేదని, ఇలాంటి బద్దకస్తుడైన (లేజీ) సీఎంను తాను ఎక్కడా చూడలేదని అంటూ దూషించారు.

నేను సీఎం కాదు

నేను సీఎం కాదు

డాకర్ట్ విష్ణువర్దన్ స్మారకం నిర్మాణం విషయం తలుచుకుంటే కడుపు మండిపోతుందని నటుడు అనిరుద్ విచారం వ్యక్తం చేశారు. నటుడు అనిరుద్ విషయంపై సీఎం. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ విష్టువర్దన్ మరణించిన సమయంలో తాను సీఎం పదవిలో లేనని గుర్తు చేశారు.

ప్రభుత్వ లాంచనాలు

ప్రభుత్వ లాంచనాలు

విష్ణువర్దన్ మరణించిన సమయంలో బనశంకరి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. అయితే అక్కడ అంత్యక్రియలు వద్దు, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అందరితో చర్చించిన తనను లేజీ సీఎం అంటారా అంటూ కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.

నోరు అదుపులో పెట్టుకో

నోరు అదుపులో పెట్టుకో

ఏదైనా మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, లేదంటే ప్రజలే సరైన సమాధానం చెబుతారని సీఎం కుమారస్వామి డాక్టర్ విష్ణువర్డన్ అల్లుడు అనిరుద్ ను హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం డాక్టర్ విష్ణువర్దన్ సతీమణి, బహుబాష నటి భారతీ విష్ణువర్దన్, ఆమె అల్లుడు అనిరుద్ సీఎం కుమారస్వామిని కలిసి స్మారక నిర్మాణ పనుల విషయంపై చర్చించారు.

అత్త క్షమాపణ

అత్త క్షమాపణ


అయితే డాక్టర్ విష్ణువర్దన్ స్మారక స్తూపం కంఠీరవ స్టూడియోలో నిర్మించకపోవడంపై ఆయన అల్లుడు అనిరుద్ సీఎం కుమారస్వామి మీద మండిపడ్డారు. సీఎం కుమారస్వామి అనిరుద్ కు ఘాటైన సమాధానం ఇవ్వడంతో డాక్టర్ విష్ణువర్దన్ సతీమణి భారతీ విష్ణువర్దన్ అనిరుద్ తరుపన సీఎం కుమారస్వామికి క్షమాపణ చెప్పారు.

 అవమానించారు

అవమానించారు


డాక్టర్ విష్ణువర్దన్ స్మారకం 9 ఏళ్లుగా అక్కడా ఇక్కాడా అంటూ కాలం గడుపుతూ మమ్మలి అవమానిస్తున్నారని ఆయన కుమార్తె కీర్తి విష్ణువర్దన్ విచారం వ్యక్తం చేశారు. వీలైతే మైసూరులో విష్ణువర్దన్ స్మారకం నిర్మించాలని కీర్తి విష్ణువర్దన్ అన్నారు. లేదంటే అభియాన్ స్టూడియోలో విష్ణువర్దన్ స్మారకం నిర్మించినా తమకు అభ్యంతరం లేదని డాక్టర్ భారతీ విష్ణువర్దన్, ఆమె కుమార్తె కీర్తి విష్ణువర్దన్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+