యూటర్న్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని !

బెంగళూరు: నరేంద్ర మోడీ రెండవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి హాజరుకానున్నారు. సీఎం కుమారస్వామికి ప్రధాని కార్యాలయం నుంచి అధికారికంగా ఆహ్వాన పత్రం అందింది.

ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెలుతున్నారు. మద్యాహ్నం రెండు గంటల సమయానికి ఢిల్లీ చేరుకుంటున్న కుమారస్వామి అక్కడి కర్ణాటక భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Karnataka CM Kumaraswamy will attend Narendra Modi oath taking ceremony in Delhi tomorrow.

అనంతరం కర్ణాటకలోని కన్నడ భవన్ లో అధికారులతో చర్చలు జరిపిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి చేసుకున్న తరువాత అదే రోజు సీఎం కుమారస్వామి బెంగళూరు బయలుదేరుతున్నారు.

సీఎం కుమారస్వామితో పాటు జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సహ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారని తెలిసింది. 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ హాజరైనారు. అయితే గురువారం జరిగే కార్యక్రమానికి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ హాజరయ్యే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దేశంలోని వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+