నిరూపిస్తే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటా, మోదీకి చాలెంజ్ చేసిన సీఎం, అంతేనా !
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎత్తులకు పైఎత్తులు వెయ్యడానికి రాజకీయ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ ఈసారి ప్రధాని అవుతారని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటి నుంచే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
గ్రాంటుల పంపిణీలో కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, మోసంపై తాను అబద్ధాలు చెబుతున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను శాస్వతంగా తప్పుకుంటానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాంటుల పంపిణి విషయంలో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సైలెంట్‌గా ఉన్నారని, కేంద్రం చెప్పిన మాటలకు ఆయన తల ఆడిస్తున్నారని, అంటే మనం కూడా అలాగే చేయాలా? అన్యాయం జరిగితే ఓపికగా, మౌనంగా ఉండాలా? అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.

హరిహర్ తాలూకాలోని రాజనహళ్లిలోని మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య కర్ణాటక రాష్ట్రానికి అన్యాయం జరిగితే నిరసన తెలపకూడదా? సీఎంగా ఉన్న సమయంలో బీఎస్ యడ్యూరప్ప నిరసన తెలపలేదని, ఆయన నోరు మూసుకున్నట్లు మనం నోరు మూసుకోవాలా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం సిద్దరామయ్య ఘాటుగా ప్రశ్నించారు. కర్ణాటక 100 రూపాయల పన్ను చెల్లిస్తే 12 నుంచి 13 రూపాయలే మాకు తిరిగి వస్తుందని, వారు జేబులోంచి మాకు గ్రాంట్లు ఇవ్వడం లేదు కదా అని సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
దేశంలో మొత్తం పన్నుల వసూళ్లలో కర్ణాటక రెండో స్థానంలో ఉందని, అయినా మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను అపద్ధాలు చెబుతున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. రైతులకు తాత్కాలికంగా 2 వేల రూపాయల కరువు సాయం అందించామని, 34 లక్షల మంది రైతులకు రూ. 650 కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం సిద్దరామయ్య అన్నారు
కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు గ్రాంట్లు, నిధులు ఇవ్వడం లేదని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. దీనిపై కర్ణాటకలోని బీజేపీ నాయకులు పెదవి విప్పడం లేదని, మాజీ సీఎం యడియూరప్ప, ఆర్.అశోక్, బసవరాజ్ బోమ్మయ్, బీవై విజయేంద్ర దీని గురించి మాట్లాడడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాతో మాట్లాడి నిధిలు విడుదల చేయించడంలో బీజేపీ నాయకులు పూర్తిగా విఫలం అయ్యారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications