అన్ని హామీలు నేరవేరుస్తాము, ఎన్నికల తరువాత ఆలోచిస్తాం, సీఎం !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరువాత ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని అమలు చేస్తామని కర్ణాటక ముక్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు.
అయితే సంబంధిత మంత్రులు, ఆ శాఖ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన గ్యారెంటీలు అన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించింది.

విద్యుత్ బిల్లులు కట్టనవసరం లేదని, మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రమాణం చెయ్యడానికి మేము గ్రీన్స సిగ్నల్ ఇస్తామని తదితర ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మేము విద్యుత్ బిల్లులు కట్టమని స్తానికులు ఎదురు తిరుగుతున్నారు.
ఆర్ టీసీ బస్సుల్లో ప్రమాణిస్తున్న మహిళలు మేము బస్సు టిక్కెట్లు తీసుకోము అని ఎదురు తిరుగుతున్నారు. ఈ విషయాలపై విద్యుత్ శాఖ, ఆర్ టీసీ అధికారులు సీఎం సిద్దరామయ్యకు మేము ఏం చెయ్యాలో క్లారిటీ ఇవ్వాలని మనవి చేశారు. అయితే అంతా సక్రమంగా ఉందని అంటున్న సీఎం సిద్దరామయ్య ఎన్నిక ముందు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు,

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చెయ్యాలని ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి మంత్రి వర్గంతో చర్చించినతరువాత సరైన నిర్ణయం తీసుంటామని సిట్టింగ్ సీఎం సిద్దరామయ్య అమలు చేస్తారా ? లేదా ? అని ఆలోచిస్తున్నారని తెలిసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications