Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రా, తెలంగాణ కాదని చెప్పినా కర్ణాటక ప్రయత్నాలు ఫలించాయి. అక్కడే సిద్దూ డీల్ !

బెంగళూరు/పంజాబ్: కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన అన్నభాగ్య పథకానికి బియ్యం సేకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ నుండి బియ్యం కొనుగోలు చెయ్యడానికి ఆ రాష్ట్ర సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అవసరమైన బియ్యాన్ని కర్ణాటక ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.

జాతీయ స్థాయి సహకార సంఘాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బియ్యం పంపిణీ చేసే విషయంలో పంజాబ్ సీఎం, కర్ణాటక సీఎంల చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. కర్ణాటకకు బియ్యం ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.

Karnataka CM Siddaramaiah is preparing to buy rice from Punjab

అన్నభాగ్య పథకం కింద, బీపీఎల్ కార్డులపై ఓ వ్యక్తికి ఉచిత బియ్యాన్ని ప్రస్తుతం 5 కిలోల నుండి 10 కిలోలకు పెంచాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఓ వ్యక్తికి మొత్తం 10 కిలోలు బియ్యం సరఫరా చేయడం వల్ల ఖజానాకు నెలకు రూ. 840 కోట్లు, ఏటా రూ.10,092 కోట్లు ఖర్చవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

అన్న భాగ్య పథకం జూలై 1న ప్రారంభం కానుందని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్‌లో సరిపడా బియ్యం ఉందని ఆప్ కర్ణాటక యూనిట్ రంగంలోకి దిగి కర్ణాటక ప్రభుత్వానికి చెప్పడంతో పంజాబ్ నుంచి బియ్యం తీసుకోవాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పంజాబ్ కూడా మనస్ఫూర్తితో కర్ణాటకను బియ్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని కర్ణాటక ఆప్ నాయకులు అంటున్నారు.

సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫోన్ లో మాట్లాడుకున్నారని కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వీ రెడ్డి అన్నారు. ఈ సమయంలో కర్ణాటక ప్రజలకు బియ్యం అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ అంటున్నారు. గోడౌన్లలో అన్నదాతలు పండించిన బియ్యం కుళ్లిపోతున్నాయని, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి వైఖరిని ప్రదర్శించడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

Karnataka CM Siddaramaiah is preparing to buy rice from Punjab

కర్ణాటకకు సాయం చేసేందుకు ఆప్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈ పథకం పేదల సమస్యలను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అని ఆప్ కన్వీనర్ పృథ్వీ రెడ్డి ది హిందూ పత్రికకు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం జులై 1న అన్న భాగ్య పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించినప్పటికీ బియ్యం కొనుగోలు విషయంలో ఆలస్యం కావడంతో నాయకులు అయోమయంలో పడిపోయారు.

బియ్యం సరఫరా చేయడానికి పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. అన్నభార్య పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన 2. 28 లక్షల టన్నుల బియ్యం అందించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నిరాకరించింది. అప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో బియ్యం కొనుగోలు చెయ్యడానికి నానా తంటాలుపడింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సరఫరా చేయ్యలేమని తేల్చి చెప్పడంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 1.5 లక్షల టన్నులు సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు చేసే బియ్యాన్ని కిలోకు రూ. 26, రవాణా ఖర్చుతో కిలోకు రూ. 34 చొప్పున కొనుగోలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం పలు రాష్ట్రాలకు ఆఫర్ చేసింది.

Karnataka CM Siddaramaiah is preparing to buy rice from Punjab

బియ్యం సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మండిపడుతున్నారు. సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ జాతీయ సహకార వినియోగదారుల మహామండల్, జాతీయ వ్యవసాయ సహకార సేల్స్ మహామండల్, అనుకూల పేద పథకం. మేము ఈ ఏజెన్సీలు సరఫరా చేయగల బియ్యం పరిమాణానికి సంబంధించిన వివరాలను తీసుకుంటాము. మేము టెండర్ ద్వారా బియ్యాన్ని సేకరించేందుకు కూడా ప్రయత్నిస్తామని అన్నారు.

పంజాబ్ నుంచి బియ్యం సరఫరా చేసుకుంటే ఖర్చుతో కూడుకున్న పని అని సీఎం సిద్దరామయ్య అంటున్నారు. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంజాబ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జూలై 1వ తేదీన అన్నా భాగ్య పథకాన్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కేంద్రం వద్ద బియ్యం స్టాక్‌ ఉందని, కర్ణాటకకు బియ్యం సరఫరా చేసేందుకు వాళ్లకు మనసు రావడంలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+