ప్రధాని మోదీ, బీజేపీపై సీఎం సంచలన వ్యాఖ్యలు, అందుకే నన్ను చూస్తే భయం

పెత్తందార్ల విషయంలో కాంగ్రెస్ పోరాడుతోందని, దీన్ని బీజేపీ సహించడం లేదని, అందుకే నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ పనిచేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో సద్భావన దినోత్సవం, డి.దేవరాజు అరసు జయంతిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసమానతలను రూపుమాపాలని, పెత్తందార్లను అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని సిద్దరామయ్య అన్నారు. ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఇప్పటికీ మేము పోరాడుతున్నామని, వీటికి వ్యతిరేకంగా నేను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు బీజేపీ నన్ను చూసి తట్టుకోలేకపోతోందని, ఇప్పుడు తాను అలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, తనకు బ్రేకులు వెయ్యాలని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకులను విమర్శించారు.

Karnataka CM Siddaramaiah made sensational comments by BJP

వెనుకబడిన, మైనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు తాము అండగా ఉన్నామని, బీజేపీ ఈ కులాల వాళ్లకు ఏం న్యాయం చెయ్యలేదని, ఆ కులాలకు మేమే అండగా ఉంటామని ఎంతగా చెప్పుకుంటున్నా ఆ పేదలు, దళితులు, వెనుకబడిన, మైనార్టీలకు వాళ్లను పట్టించుకోవడం లేదని సిద్దరామయ్య అన్నారు. పేదలను ఆదుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని, వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని సిద్దరామయ్య ఆరోపించారు.

ఇలాంటి వర్గాలకు అధికారం రాకూడదని బీజేపీ కోరుకుంటోందని, అందులో భాగంగా తన మీద ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు.

రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే దేశానికి ప్రధాని అయ్యారని, ఈ విషయాన్ని కూడా ఇప్పటికీ బీజేపీ జీర్ణించుకోవడం లేదని సిద్దరామయ్య ఆరోపించారు. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని సిద్ధరామయ్య అన్నారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి రాజీవ్ గాంధీనే కారణం అని సిద్దరాయయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+