బాహుబలి-2 చూసిన సీఎం: రూ. 50 వేలకు టిక్కెట్లు ! దుమ్మెత్తిపోశారు, అయితే ?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నిత్యం రాజకీయాలతో తీరికలేకుండా గడిపే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొంచెం విరామం తీసుకుని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సినిమా చూశారు. అయితే ఆయన అధిక ధరకు టిక్కెట్లు బుక్ చేసుకుని సినిమా చూశారని పలువురు మండిపడుతున్నారు.

బాహుబలి టికెట్ ధర: సిద్ధరామయ్యపై విమర్శలకు కారణం ఇదీ...

సీఎం చేసిన తప్పు ఏమిటీ ? సినిమా చూడటం తప్పా ? సీఎం అయితే సినిమా చూడకూడదని రూల్ ఎక్కడైనా ఉందా ? అత్యవసర సమావేశాలు ఏమీ లేకపోవడం వలనే సీఎంగారు కొంత సమయం కుటుంబ సభ్యుల కోసం కేటాయించి సినిమా చూశారు, దీన్నీ రాజకీయం చేస్తారా ? అంటూ సిద్దరామయ్య సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. పాపం పరభాష చిత్రం బాహుబలి-2 సినిమా చూసిన సిద్దరామయ్య మీద కన్నడిగులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

బాహుబలి-2 క్రేజ్

బాహుబలి-2 క్రేజ్

బాహుబలి-2 సినిమా క్రేజ్ అంతా, ఇంతకాదు అనే విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి-2 చూసిన అనేక మంది ప్రముఖులు మంచి సినిమా తీశారని దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన టీంను అభినందిస్తున్నారు.

పాపం సీఎంకు తప్పని తిప్పలు

పాపం సీఎంకు తప్పని తిప్పలు

బెంగళూరులోని రాజాజీనగర్ లో ఉన్న ఓరియన్ మాల్ లోని పీవీఆర్ సినిమాస్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి సోమవారం మద్యాహ్నం 2.30 గంటలకు బాహుబలి-2 సినిమా వీక్షించారు. సినిమా చూడటానికి సీఎం 48 టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

సినిమా చూడటానికి ఇదే కారణం

సినిమా చూడటానికి ఇదే కారణం

కన్నడ సినిమాలు చూడటానికే సామాన్యంగా సీఎం సిద్దరామయ్య థియేటర్లో అడుగుపెట్టారు. ఇటీవల మైసూరులో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార సినిమాను చూశారు. ఇప్పుడు తన ముద్దుల మనవడు ధవన్ బాహుబలి-2 సినిమా చూపించాలని, నాతో సినిమాకు రావాలని ఒత్తిడి చెయ్యడంతో సిద్దరామయ్య పీవీఆర్ సినిమాస్ లో అడుగుపెట్టారు.

తండ్రి లేని లోటు తీర్చడానికే

తండ్రి లేని లోటు తీర్చడానికే

సిద్దరామయ్య కుమారుడు రాకేష్ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చికిత్స విఫలమై విదేశాల్లో మరణించిన విషయం తెలిసిందే. రాకేష్ కుమారుడు ధవన్ ఒత్తిడి చెయ్యడం వలనే మే 1వ తేది సెలవు కావడం, మా నాన్నకు కొంచెం తీరిక చిక్కడం వలనే కుటుంబ సభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూడటానికి వెళ్లామని సిద్దరామయ్య మరో కుమారుడు
డాక్టర్ యతీంద్ర మీడియాకు వివరణ ఇచ్చారు.

టిక్కెట్టు ధర రూ. 1, 050, డబ్బులు ఇవ్వడం తప్పేనంట !

టిక్కెట్టు ధర రూ. 1, 050, డబ్బులు ఇవ్వడం తప్పేనంట !

మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధర రూ. 200 మించి ఉండరాదని సీఎం సిద్దరామయ్య ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే బాహుబలి-2 సినిమా చూడటానికి సిద్దరామయ్య గోల్డ్ క్లాస్ లో ఒక్కొటిక్కెట్ రూ. 1, 050 చెల్లించి తీసుకున్నారని వెలుగు చూసింది. రూ. 200కే టిక్కెట్ అమ్మాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం చివరికి ఆయనే రూ. 1, 050 చెల్లించి ఎలా టిక్కెట్లు తీసుకుంటారని పలువురు కన్నడ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

వరుసగా రెండు సినిమాలు చూసిన సీఎం

వరుసగా రెండు సినిమాలు చూసిన సీఎం

బాహుబలి-2 సినిమా చూసిన తరువాత సీఎం సిద్దరామయ్య నేరుగా శివాజీనగర్ సమీపంలోని కన్నింగ్ హ్యాం రోడ్డులోని చాముండేశ్వరీ స్టూడియోకి వెళ్లారు. అపూర్వ కాసరహళ్లి దర్శకత్వం వహించిన నిరుత్తర అనే సినిమాను హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తదితరులతో కలిసి చూశారు.

అదే సీఎం చేసిన తప్పు

అదే సీఎం చేసిన తప్పు

మల్టీఫెక్స్ థియేటర్లలో ఒక్క టిక్కెట్ రూ. 200 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసిన సీఎం స్వయంగా ఆయనే ఎక్కువ ధర చెల్లించి సినిమా చూశారని పలు కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. అంతే కాకుండా పరభాష సినిమా (కన్నడ కాకుండా తెలుగు) సినిమా ఎలా చూస్తారని పరోక్షంగా సీఎంను ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka Chief Minister Siddaramaiah watched 'Baahubali-2' movie yestarday (May 1st) by paying Rs.1050 perticket. CM Siddaramaiah watched 'Baahubali-2' because of his Grand Son Dhawan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి