భక్తుల రద్దీ వేళ TTD తాజా నిర్ణయాలు, అప్పటి వరకు ఆ లేఖలు రద్దు -ఇక అలిపిరి వద్దే..!!

Tirumala: టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేసారు. అదే విధంగా సాధారణ భక్తుల కోసం అవసరమైన నిర్ణయాలకు సిద్దమయ్యారు. తిరుమ‌ల‌ లోని రోడ్లు, స‌ర్కిళ్ల‌కు క‌మిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశ‌స్థ్యం క‌లిగిన పేర్లను పెట్టేందు కు ఆమోదం తెలిపారు. ఇక.. అలిపిరితో పాటుగా.. క్యూ లైన్లలోనూ కొత్తగా భక్తుల కోసం నిర్ణయాల ను బోర్డు ఆమోదించింది. తిరుమలలో అక్షర గోవిందం కార్యక్రమం ప్రారంభించనున్నారు.

టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం స‌ర్కిల్ నుండి బాట గంగ‌మ్మ స‌ర్కిల్ వ‌ర‌కు ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల‌లో రూ.4.55 కోట్ల‌తో అద‌న‌పు మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదించారు. టీటీడీ విద్యాశాఖకు అదనంగా రూ.43.44 కోట్లు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. గోగర్భం డ్యామ్ వద్ద రూ.6 కోట్లతో అదనపు పైప్‌లైన్ నిర్మాణం చేపడతామని అన్నారు. రూ.44.2 కోట్లతో ఆప్కో, కో అప్టెక్స్ నుంచి పట్టువస్త్రాలు, శాలువలు కొనుగోలు చేస్తామని తెలిపారు. పాడేరులో రూ.55 లక్షలతో శివాలయం నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా కిట్లు కేటాయిస్తామని తెలిపారు. చెన్నైలోని కోయంబత్తూర్‌లో జీ స్క్వేర్ సంస్థ విరాళంగా ఇచ్చిన 19.53 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకొని ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. నవీ ముంబైలో సంప్రోక్షణ కార్యక్రమం కోసం అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియమకం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆమోదించామని చెప్పుకొచ్చారు. రూ.2.7 కోట్లతో తుళ్లూరులో రాజగోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

ttd-decided-for-free-kits-to-be-distributed-to-children-under-akshara-govindam-programme-in-board

వేసవి రద్దీ తగ్గే వరకు వీఐపీ సిఫారసు లేఖలు రద్దు

వెంకటాయపాలెంలోని శ్రీవారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు రూ.46.95 కోట్ల నిధులు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. రూ.3.61 కోట్లతో వరాహస్వామి అతిథి గృహ ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు రూ.4.71 కోట్లతో యాగశాల నిర్మాణానికి ఆమోదించామని చెప్పారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదించామని అన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా శోభరాజ్‌ను నియమించినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో కల్యాణమండపం నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఇచ్చే వైద్య ఖర్చులను రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. అలిపిరి వినాయక ఆలయం వద్ద రూ.4.7 కోట్లతో బస్సుల తనిఖీకి నూతనంగా షెడ్‌ను నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి పాలకమండలి సభ్యులతో ఓ కమిటీ నియమించినట్లు చెప్పారు. అలిపిరి వద్ద టౌన్ షిప్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. తిరుపతిలో భారీ గోడౌన్ నిర్మాణానికి ఆమోదం తెలిపామనన్నారు. వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జూలై 15వ తేదీ వరకూ ప్రజాప్రతినిధుల సిఫార్సుపై కేటాయించే బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+