ఆసుపత్రి ఐసీయూలో సీఎం సతీమణి, రాత్రి ఒక్కసారిగా ఆనారోగ్యంతో, ఢిల్లీ పర్యటన !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సిద్దరామయ్య, ఆయన కుమారుడు యతీంధ్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. యతీంద్ర మైసూరు జిల్లాలోని వరుణ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న తండ్రి సిద్దరామయ్య గెలుపుకోసం అక్కడే ఉండిపోయారు. ఇక సిద్దరామయ్య కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో సంచరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేశారు.
ఆ సమయంలో సిద్దరామయ్య సతీమణి పార్వతి ఇంట్లోనే ఉన్నారు. తరువాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం. సిద్దరామయ్య సీఎం అయిపోవడం జరిగింది. సీఎం అయిన తరువాత సిద్దరామయ్య సభలు, సమావేశాలు, ఢిల్లీలో హైకమాండ్ తో చర్చలు అంటూ చాలా బిజీగా గడిపారు.

కొన్ని రోజులుగా జ్వరంతో భాదపడుతున్న సిద్దరామయ్య సతీమణి పార్వతి అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం రాత్రి ఆమెను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతికి ఐసీయూలో చికిత్స అందించారు. సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంధ్ర మణిపాల్ ఆసుపత్రిలో పార్వతికి తోడుగా ఉన్నారు.
సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి ఆరోగ్యం కుదుటపడుతోందని, బుధవారం ఆమెను ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేస్తారని మణిపాల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భార్య పార్వతి ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో బుధవారం సీఎం సిద్దరామయ్య ఢిల్లీ పర్యటన ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే బుధవారం సీఎం సిద్దరామయ్య ఢిల్లీ వెలుతారని, బయలుదేరే సమయంలో మార్పులు మాత్రమే ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కొందరు మంత్రులు, సిద్దరామయ్యకు సిన్నిహితులైన ఎమ్మెల్యేలు మణిపాల్ ఆసుపత్రికి చేరుకుని సీఎం సతీమణి పార్వతి ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలిసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications