కర్ణాటక శాసన మండలి బాహాబాహీ: డిప్యూటీ ఛైర్మన్‌ను లాగేసిన సభ్యులు: బలవంతంగా బయటికి
బెంగళూరు: కర్ణాటక శాసన మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సభ్యులు బాహాబాహికి పాల్పడ్డారు. వారి మధ్య పతాక స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. ఘర్షణ పడ్డారు. ఒక దశలో కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోయారు. ఛైర్మన్ స్థానాన్ని అవమానించారు. డిప్యూటీ ఛైర్మన్‌ను ఆయన స్థానం నుంచి లాగేశారు. బలవంతంగా బయటికి పంపించేశారు. ఛైర్మన్ స్థానం ఎదురుగా ఉన్న అద్దాన్ని పగులగొట్టారు. దీనితో మండలిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video


ధర్మేగౌడను పరాభవం..
శాసన మండలి శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం మండలి ప్రారంభమైన వెంటనే.. డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు. సభా కార్యక్రమాలను ఆరంభించారు. ఆయన ఛైర్మన్ స్థానంలో కూర్చోవడం పట్ల కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానంలో కూర్చునే హక్కు ధర్మేగౌడకు లేదని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు అక్రమంగా ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
పోడియం వద్ద దూసుకెళ్లి..
తాము శాసన మండలి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, దానిపై చర్చించకుండా బీజేపీ-జేడీఎస్ సభ్యులు తమను అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. తాము గౌరవంగా ధర్మేగౌడను ఛైర్మన్ స్థానం నుంచి దిగిపోవాలని విజ్ఙప్తి చేశారు. దానికి ఆయన అంగీకరించలేదు. దీనితో కాంగ్రెస్ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహించిన వారంతా పోడియం వైపు దూసుకెళ్లారు. ఆయనతో ఘర్షణ పడ్డారు. అయినప్పటికీ.. ఆయన ఛైర్మన్ స్థానం నుంచి లేవ లేదు. తాను నిబంధనల ప్రకారమే మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యానని చెప్పారు.

బయటికి పంపించి.. లోపలి నుంచి గడియ..
దానికి కాంగ్రెస్ సభ్యులెవరూ వినిపించుకోలేదు. ఛైర్మన్ స్థానంలో కూర్చన్న ధర్మేగౌడను పక్కకు లాగేశారు. రెండు చేతులను పట్టుకుని పైకి లేపారు. బలవంతంగా ఆయనను ఆ స్థానం నుంచి ఖాళీ చేయించారు. ఛైర్మన్ స్థానం వెనుక వైపు ఉన్న మార్గం గుండా ఆయనను బయటికి పంపించేశారు. అనంతరం లోపలి నుంచి గడియ పెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులకు బీజేపీ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. ఘర్షణకు దిగారు.

నిబంధనలకు వ్యతిరేకంగా..
ఆయన అక్రమంగా మండలి స్థానాన్ని ఆక్రమించారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఆయనను బయటికి పంపించే నైతిక హక్కు తమకు ఉందని కాంగ్రెస్ సభ్యుడు ప్రకాష్ రాథోడ్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించాల్సి ఉన్న దశలో ఆయన ఎలా ఛైర్మన్ స్థానాన్ని ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని బీజేపీ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి పరిణామాలను తాము చట్టసభల్లో ఎప్పుడూ చూడలేదని బీజేపీ సభ్యుడు లెహర్ సింగ్ షిరోయా అన్నారు. ఛైర్మన్ స్థానాన్ని కించపరిచిన కాంగ్రెస్ సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతరం శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications