ఇంట్రెస్టింగ్ : ఎన్నికల వేళ వివాహం.. ఓటర్ ఐడీ తరహా ఆహ్వానం
బెంగళూరు : ఇటీవల వెడ్డింగ్ కార్డులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొన్నటివరకు మోడీ మళ్లీ ప్రధాని కావాలని.. దానికోసం బీజేపీకి ఓటేయ్యాలనే కాన్సెప్టుతో.. ఎలాంటి కానుకలు వద్దంటూ పెళ్లి పత్రికలు దర్శనమిచ్చాయి. తాజాగా ఓటర్లలో చైతన్యం కలిగించేలా రూపొందించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఓటర్ ఐడీలా వెడ్డింగ్ కార్డు
కర్ణాటకకు చెందిన సునీల్, అన్నపూర్ణ అనే జంటకు వివాహం నిశ్చయమైంది. అయితే అక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లి కార్డు.. ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉండాలని డిసైడయ్యారు. దాంతో ఆహ్వాన పత్రికను ఓటర్ కార్డుగా ముద్రించారు. అందులో వారి పేర్లు, వివాహ సమయం, వెన్యూ తదితర వివరాలన్నీ పొందుపరిచారు.

ఓటర్లలో చైతన్యం.. బంధుమిత్రుల ప్రశంసలు
లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పెళ్లి కార్డు వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతిఒక్కరూ ఆ జంటను అభినందిస్తున్నారు. తమ వివాహాన్ని సమాజాన్ని జాగృతపరిచేలా ప్లాన్ చేసుకోవడం శభాష్ అంటూ కితాబిస్తున్నారు. ఈనెల 26న వివాహం జరగనుండటంతో బంధుమిత్రులందరికీ ఇవే కార్డులు పంపిస్తున్నారు.
ఓటు హక్కు వినియోగం, దాని ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా డిసైడయినట్లు చెబుతున్నారు. అందులో వివాహ వేడుకకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు చిన్న మేసేజ్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పేర్కొన్నారు.

అప్పుడు కూడా ఇలాంటి కార్డే..!
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి కార్డు దర్శనమిచ్చింది. రైల్వే ఉద్యోగి, సామాజిక కార్యకర్త సిద్దప్ప తన వివాహ పత్రికను ఇలాగే ఓటర్ ఐడీ కార్డు రూపంలో ముద్రించారు. జ్యోతి అనే యువతిని అతను పెళ్లి చేసుకున్నాడు. అయితే సిద్దప్ప తమ వివాహ పత్రికకు ఎపిక్ కార్డు (ఓటర్ ఐడీ) నెంబర్ మాదిరిగా 'SJMRG27042018' వేయించారు. సిద్దప్ప జ్యోతి మ్యారేజ్ 2018, ఏప్రిల్ 27న అని దానర్థం.
2018, మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో తన వివాహం ఉండటంతో ఓటర్లలో చైతన్యం కలిగించేలా పెళ్లికార్డును ఇలా ముద్రించారు సిద్దప్ప. అప్పట్లో అది కూడా బాగా వైరలయింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications