బీఎల్ఎస్ కు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చిన డీకే, మొత్తం టచ్ లో ఉండండి !
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఎల్. సంతోష్ పేరు బలంగా ట్రెండ్ సృష్టించింది. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు బీజేపీ జాతీయ నేత బీఎల్. సంతోష్ పేరు వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఇదే అంశంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ స్పందించారు. కర్ణాటక రాష్ట్రంలో ఆపరేషన్ హస్తం, ఆపరేషన్ కమలపై జోరుగా చర్చ సాగుతోందని అన్నారు.
ఇంతలో బీఎల్ సంతోష్ ప్రకటన సంచలనం రేపింది. అయితే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పవర్ ఫుల్ లీడర్ డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీ నేతలపై డీసీఎం డీకే శివకుమార్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇంతకీ డీసీఎం డీకే శివకుమార్ స్పందన ఏమిటి? బీఎల్ సంతోష్ ప్రకటనపై డీసీఎం డీకే శివకుమార్ స్పందన ఏమిటి? అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది.

శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీసీఎం డీకే శివకుమార్ సమాధానమిస్తూ బీఎల్ సంతోష్ జాతీయ నాయకుడని అనుకుంటున్నానని, కేఎస్. ఈశ్వరప్ప, సీటీ రవి లాగా మాట్లాడితే ఏమీ చేయలేం. 136 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన టచ్‌లో ఉండనివ్వండి. అందులో తప్పేముంది? ఆయన అధికార పార్టీ నాయకుడు అంటూ వ్యంగంగా అన్నారు.
బీఎల్ సంతోష్ ఆయన జాతీయ నాయకుడు అనే బ్రమలో ఉన్నారని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని డీకే శివకుమార్ మండిపడ్డారు. కాబట్టి అలాంటి ప్రకటన చేయవద్దని ఆయనను అభ్యర్థిస్తున్నాను అని డీకే శివకుమార్ అన్నారు. తన పరువుకు భంగం కలగకూడదని, అలా చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని పరోక్షంగా బీఎల్ సంతోష్ ను ఉద్దేశించి డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీఎల్ సంతోష్ తో టచ్‌లో ఉన్నారనే సమాచారం మాకు లేదని డీకే శివకుమార్ అన్నారు. మరింత సమాచారం కోసం ఎమ్మెల్యేను అడగాలని డీకే శివకుమార్ అన్నారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
IPL మ్యాచ్లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications