Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికార పార్టీకి చెందిన పవర్ ఫుల్ మంత్రి, 50 మంది ఎమ్మెల్యేలు జంప్ ?, నేను బైబర్త్ ఆ పార్టీనే !

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఆరు నెలలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన తరువాత సీఎం కుర్చీ విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మద్య ప్రత్యక్ష యుద్దం జరిగిన విషయం దేశం మొత్తం తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాజీ ఫార్ములాతో సీఎం సీటులో సిద్దరామయ్య, డీసీఎంగా, కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పని చేస్తున్నారు.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత 50 నుండి 60 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓ పవర్ ఫుల్ మంత్రి బీజేపీలో చేరుతారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పవర్ ఫుల్ మంత్రి ఎవరు ? అనే విషయంపై సామాన్య ప్రజల్లో జోరుగా చర్చ జరిగినా రాజకీయ వర్గాల్లో ఆ నాయకుడు డీకే శివకుమార్ అని చర్చ మొదలైయ్యింది.

Karnataka DCM DK Sivakumar said that I and Congress MLAs will not join BJP under any circumstances.

ఇదే విషయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీద మండిపడ్డారు. ఈ విషయమై బెళగావిలోని సువర్ణసౌధ దగ్గర మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ నేను పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. వేరే పార్టీలోకి వెళ్లాలనే పిచ్చి ఆలోచన తనకు లేదు. నాకు నా స్వంతంగా కొన్ని ప్రాథమిక ఆదర్శాలు ఉన్నాయని, గాంధీ కుటుంబంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా నాకు చాలా నమ్మకం ఉందని డీకే శివకుమార్ అన్నారు. ఎవరో ఏదో చెప్పారని వాటికి సమాధానాలు చెప్పుకుంటా తాను తిరగలేనని డీకే శివకుమార్ మాజీ సీఎం కుమారస్వామి మీద విరుచుకుపడ్డారు.

సోమవారం రాజ్యసభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ కర్ణాటకలో కుల గణన అమలుపై డీకే శివకుమార్, బీజేపీ నేతల వ్యతిరేకత గురించి మాట్లాడారని, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని విలేకరులు డీకే శివకుమార్ ను ప్రశ్నించారు. కుల గణనను నేనెప్పుడూ వ్యతిరేకించలేదని, కుల గణన సర్వే శాస్త్రీయంగా, క్రమపద్ధతిలో జరగాలన్నదే మా అభిప్రాయం అని డీసీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

Karnataka DCM DK Sivakumar said that I and Congress MLAs will not join BJP under any circumstances.

కుల గణన సర్వే సక్రమంగా జరగలేదని మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇంటింటి సర్వే నిర్వహించలేదని ఫిర్యాదులు అందాయని, అన్ని సంఘాలు వారి జనాభా నిష్పత్తిలో తమ హక్కును పొందాలని, మైనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో సహా ప్రతి ఒక్కరూ తమ జనాభా ప్రకారం హక్కులు పొందాలని డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే లోక్ సభ ఎన్నికల తరువాత తాను పార్టీ మారుతాను అని జరుగుతున్న ప్రచారంపై డీకే శివకుమార్ మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+