జీవిత ఖైదీ భార్యతో డీల్: నకిలీ సుప్రీంకోర్టు ఆర్డర్‌తో రిలీజ్.. జైళ్ల శాఖ డీఐజీ అరెస్ట్!

నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సృష్టించి ఓ జీవిత ఖైదీని అక్రమంగా జైలు నుంచి విడుదల చేసిన కేసులో కర్ణాటక జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ) ఎం.సోమశేఖర్(50) తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం బెళగావి(నార్త్ రేంజ్) డీఐజీగా పనిచేస్తున్న సోమశేఖర్‌ను అక్టోబర్ 4న పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 9 వరకు ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌గా సోమశేఖర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ అక్రమ విడుదల ప్రక్రియ జరిగింది.

13 కోట్ల ఓట్ల గాయబ్? దేశ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద మోసం!
13 కోట్ల ఓట్ల గాయబ్? దేశ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద మోసం!

2018 నాటి ఫోర్జరీ కేసు వెలుగులోకి వచ్చిందిలా..
2004లో కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న శంకర్ ఆర్ముగం అనే జీవిత ఖైదీ తరఫున దాఖలైన అప్పీళ్లను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయి. అయితే 2018 నవంబర్ 2న సుప్రీంకోర్టు శంకర్ అప్పీల్‌ను ఆమోదించి విడుదల చేయాలని ఆదేశించినట్లు ఓ నకిలీ ఉత్తర్వును జైలు శాఖలో డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీకాంత్ సుప్రీంకోర్టు ఉత్తర్వుగా ఫోర్జరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఫోర్జరీ కాపీ ఆధారంగా అప్పటి చీఫ్ సూపరింటెండెంట్ సోమశేఖర్ నవంబర్ 13, 2018న శంకర్ నుంచి విడుదల చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన పత్రాల ప్రామాణికతపై మళ్లీ విచారణ జరగడంతో ఈ భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది.

Karnataka DIG M Somashekar Arrested in Fake Supreme Court Order Case Full Details Here
కెప్టెన్సీకి గుడ్‌బై .. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!
కెప్టెన్సీకి గుడ్‌బై .. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!

విచారణలో విస్తుపోయే నిజాలు
కేసు విచారణలో భాగంగా పోలీసులు శంకర్ భార్యను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తన భర్తను విడుదల చేయడానికి అప్పటి జైలు సూపరింటెండెంట్ సోమశేఖర్‌తో ఓ ఒప్పందం కుదిరిందని.. దానికి ప్రతిఫలంగా ఆ అధికారి తనపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించారు. డీఐజీ సోమశేఖర్ విచారణకు సహకరించకపోవడం, నిజాలను దాచిపెట్టడానికి ప్రయత్నించడంతో కీలక ఆధారాల ఆధారంగా ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+