వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో 14 జిల్లాలు గ్రీన్ జోన్, తెరుచుకున్న అన్నిరకాలు షాపులు, షాపింగ్ మాల్స్‌కు మాత్రం నో...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం లేని 14 జిల్లాల్లో అన్ని షాపులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. అయితే షాపింగ్ మాల్స్‌కు మాత్రం అనుమతి లేదని స్పష్టంచేసింది. అన్నిరకాల షాపులు తెరిచేందుకు మంగళవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. నాలుగు విభాగాలుగా విడదీసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి పాజిటివ్, మరో ఇద్దరు క్వారంటైన్లోకి సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి పాజిటివ్, మరో ఇద్దరు క్వారంటైన్లోకి

రెడ్ జోన్‌లో ఆరు జిల్లాలు, ఆరెంజ్ జోన్‌లో ఐదు, యెల్లో జోన్‌లో 5, గ్రీన్‌ జోన్‌లో 14 జిల్లాలు ఉన్నాయి. ఐటీ హబ్ బెంగళూరు, పర్యాటక కేంద్రం మైసూర్ రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఛామరాజనగర్, కొప్పాల్, చిక్ మంగళూరు, రాయ్ చూర్, చిత్రదుర్గ, రామనగర, హసన్, శిమొగ్గ, హవెరి, యాద్గిర్, కోలార్, దావణగరె, ఉడుపి, కొడగు జిల్లాలు ఉన్నాయి. బెంగళూరు అర్బన్, బెలాగవి, మైసూర్, విజయ్ పుర, బాగల్ కోట్, కల్బుర్గ్, బిదర్, దక్షిణ కన్నడలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Karnataka eases lockdown norms in green zone, here the open shop list..

గ్రీన్ జోన్ పరిధిలో మినహాయింపులు వీటికే..

1.గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి.

2.ఎస్ఈజెడ్, ఈవోయూఎస్ పరిధిలో గల ఉత్పత్తి, ఇతర పారిశ్రామిక సంస్థలు తెరిచేందుకు అనుమతి.

3.రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పరిధిలో గల అన్ని షాపులు.. 50 శాతం సిబ్బందితో తెరిచేందుకు అనుమతి. సిబ్బంది మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలనే నిబంధన విధించారు. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ మాత్రమే తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

English summary
Karnataka government on Tuesday relaxed COVID-19 lockdown norms in 14 districts, giving 'conditional' permit to economic activities in the cities that fall under Green Zone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X