Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !

బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో ఇటలీలో సంతోషంగా గడుపుదామని కలలు కన్న ఓ ఎలక్ట్రీషియన్ లబోదిబో అంటున్నాడు. అప్పు చేసి ఇటలీ యువతికి రూ. 33 లక్షలు ఇచ్చిన ఎలక్ట్రీషియన్ తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను వేడుకుంటున్న ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో జరింగింది. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటలీ అమ్మాయిని నమ్ముకుని నెలకు రూ. 1 లక్ష వడ్డికి డబ్బు తీసుకువచ్చి రూ. 33 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశానని విలపిస్తున్నాడు.

భార్యకు విడాకులు

భార్యకు విడాకులు

చిక్కబళ్లాపురకు చెందిన మునిరాజు ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. చిక్కబళ్లాపురలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న మునిరాజు మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మునిరాజు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

పిల్ల కోసం పెళ్లి ప్రకటన

పిల్ల కోసం పెళ్లి ప్రకటన

మునిరాజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి మోట్రిమోనియల్ లో ప్రకటనలు ఇచ్చాడు. ఇటలీకి చెందిన యువతి దక్ష పటేల్ పేరుతో మునిరాజును ఆన్ లైన్ లో పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి మునిరాజు, దక్ష పటేల్ ఆన్ లైన్ లో చాటింగ్ చేసుకుంటున్నారు.

అంకౌట్ లో రూ. 15 కోట్లు

అంకౌట్ లో రూ. 15 కోట్లు

మా తల్లిదండ్రులు చాల శ్రీమంతులు, వారిని మన పెళ్లికి ఒప్పిస్తానని, ఆ పూచీ నాదని ఇటలీ అమ్మాయి మునిరాజకు మాయమాటలు చెప్పింది. అంతే కాకుండా నీ బ్యాంక్ అకౌంట్ లో రూ. 15 కోట్లు డిపాజిట్ చేస్తానని మునిరాజను నమ్మించింది. ఆమె మాయమాటలకు మునిరాజు పూర్తిగా నమ్మిపోయాడు.

కిలాడీ లేడీ మాటలు

కిలాడీ లేడీ మాటలు

నేను రూ. 1.5 కోట్లమే విదేశీ నగదు తీసుకువస్తున్నానని సెప్టెంబర్ 8వ తేదీ ఇటలీ యువతి మునిరాజుకు ఫోన్ చేసి చెప్పింది. తరువాత భారీ మొత్తంలో నగదు తీసుకుని వస్తుంటే కస్టమ్స్ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని, వారికి వెంటనే క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడానికి నగదు ఇవ్వాలని, అది మొత్తం భారత్ కరెన్సీ కావాలని మునిరాజును నమ్మించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+