Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారెవ్వా..ఏం బైకు బాసూ: ఈ మోటార్ బైకుతో రైతు కష్టాలు తీరినట్టే

కర్నాటక: వక్క చెట్లు ఎంత పొడువుగా ఉంటాయో తెలుసా.. మరి ఆ చెట్లు ఎక్కేక్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారు నడుముకు ఒక చిన్న బెల్టులాంటి యంత్రాన్ని కట్టుకుని చెట్టును ఎక్కేవారు. ఎక్కుతున్న సమయంలో ఆ యంత్రం తెగడమో లేక జారడమో జరిగి ప్రమాదవశాత్తు అంత ఎత్తునుంచి పడి మృతిచెందేవారు. ఇక అలాంటి మరణాలకు చెక్ పెట్టేలా ఓ సరికొత్త బైకును గణపతి అనే ఓ రైతు కనిపెట్టాడు. ఆ బైకు చిన్న మోటారు సహాయంతో పనిచేస్తుంది.

పురుగుల మందు కొట్టేందుకు ఈ బైకు ఉపయోగపడుతుంది

పురుగుల మందు కొట్టేందుకు ఈ బైకు ఉపయోగపడుతుంది

గణపతి కనిపెట్టిన మోటారు బైకు పై కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంది. ఇక దానిపై కూర్చుని సాధారణ బైకు ఎలాగైతే నడుపుతామో అలానే నడపాల్సి ఉంటుంది. నిటారుగా ఉన్న వక్క చెట్టుపైకి నేరుగా తీసుకెళుతుంది. చెట్టు పైకి చేరుకున్న తర్వాత అక్కడ పిచకారి చేసి తిరిగి కిందకు చేర్చుతుంది. వర్షాకాలంలో కచ్చితంగా పురుగుల మందు కొట్టాల్సి ఉంటుంది. దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది వక్క చెట్టు. ఇక పొడువైన చెట్లు ఎక్కి పురుగుల మందు కొట్టాలంటే అందుకు కావాల్సిన పనివాళ్లు కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. వారికి డిమాండ్ పెరిగిపోయింది.

30 సెకెన్లలో 100 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టును ఎక్కొచ్చు

ఇలాంటి తరుణంలోనే గణపతి అనే ఈ రైతు సరికొత్త మోటార్‌ బైకును కనిపెట్టాడు. చుట్టుపక్కల గ్రామాల వారు ఈ మోటారుబైకు కనిపెట్టారన్న సంగతి తెలుసుకుని గణపతి ఇంటిముందర క్యూకడుతున్నారు.మరోవైపు బైకు కూర్చొని గణపతి చెట్టు ఎక్కే వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు అయిన ఈ మోటారు బైకు సురక్షితమే కాదు.. మంచి ఔట్‌పుట్‌ను కూడా ఇస్తోంది. చెట్టును ఎక్కేందుకు మనిషికి 8 నిమిషాలు తీసుకుంటే.. అదే ఈ బైకుపై కేవలం 30 సెకన్లలోనే చెట్టు పైకి చేరుకుంటున్నాడు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ చెట్లకు పురుగుల మందు కొట్టి, అక్కడి వక్కలను చెట్టుపైనుంచి కోసుకోవడం జరుగుతోంది.

ఇవీ బైకు వివరాలు..!

ఇవీ బైకు వివరాలు..!

బైకు విషయానికొస్తే దీని బరువు 28 కేజీలు. టూ స్ట్రోక్ గేర్ బాక్స్ అమర్చారు. రెండు చైన్లు హైడ్రాలిక్ డ్రమ్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లున్నాయి.అయితే ఈ బైకు 80 కేజీల వరకు బరువున్న మనిషిని మోయగలదు.ఒక్క లీటరు పెట్రోలుతో దాదాపు 100 సార్లు చెట్టును ఎక్కేయవచ్చు. అంటే రోజుకు రూ. 4వేలు ఆదా అవుతుందని గణపతి చెబుతున్నాడు. వర్షాకాలం వస్తే వర్షాలకు వక్కలు కిందపడి నేలమట్టం అవుతున్నాయని అదే ఈ వాహనంతో నేరుగా చెట్టు ఎక్కి వక్కలను కోయొచ్చని గణపతి చెప్పాడు. తన తండ్రి కనిపెట్టిన బైకుతో ఇప్పుడు తాను కూడా ఎత్తైన చెట్లను ఎక్కి వక్కలను కోస్తున్నట్లు చెప్పింది గణపతి కూతురు సుప్రియ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+